Tollywood: ఈ చిన్నోడిని ఇప్పుడు చూస్తే ఎవరైనా ప్రేమలో పడిపోతారు.. ఫాలోయింగ్ మాములుగా లేదు.. ఎవరో గుర్తుపట్టండి..
ఓ స్టార్ హీరో చిన్ననాటి జ్ఞాపకం నెట్టింట తెగ సందడి చేస్తుంది. పైన ఫోటోను చూశారు కదా..ఆ చిన్నోడికి ప్రస్తుతం ఫాలోయింగ్ మాములుగాలేదు. అతడిని చూడగానే ఎవరైనా సరే ప్రేమలో పడిపోవాల్సిందే. ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది.
బాల్యం ఓ అందమైన జ్ఞాపకం. ప్రతి ఒక్కరికి ఎన్నో అందమైన తీపి గుర్తులను మిగిల్చేది కేవలం చిన్నతనం మాత్రమే. స్వచ్చమైన మనసులతో.. స్నేహితులు.. బంధువులు మధ్య పెంచుకున్న అనుబంధాలతో మరెన్నో మధురమైన చిన్ననాటి జ్ఞాపకాలు. మనిషి వ్యక్తిత్వమనేది బాల్యాన్ని పెనవేసుకునే ఉంటుంది.. ఎంత ఎదిగిన తన బాల్యం గుర్తురాగానే పెదాలపై తెలియని చిరునవ్వు వచ్చేస్తుంది. ఆ అందమైన తీపి గుర్తులను ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. తమ చిన్ననాటి ఫోటోస్.. స్నేహితులతో కలిసి అల్లరి చేసిన జ్ఞాపకాలను.. పదిలంగా భద్రపరుచుకున్న ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ ఫాలోవర్లతో పంచుకుంటున్నారు. అయితే ఇటీవల కాలంలో సెలబ్రెటీలకు సంబంధించిన చిన్ననాటి జ్ఞాపకాలను తెలుసుకునేందుకు నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో స్టార్స్ చిన్ననాటి ఫోటోస్ నెట్టించ తెగ వైరలవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరో చిన్ననాటి జ్ఞాపకం నెట్టింట తెగ సందడి చేస్తుంది. పైన ఫోటోను చూశారు కదా..ఆ చిన్నోడికి ప్రస్తుతం ఫాలోయింగ్ మాములుగాలేదు. అతడిని చూడగానే ఎవరైనా సరే ప్రేమలో పడిపోవాల్సిందే. ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ గా మెప్పిస్తున్నాడు. ఎవరో గుర్తుపట్టండి. ఈరోజు ఈ బుజ్జాయి పుట్టిన రోజు కూడా.
ఈ చిన్నోడి తండ్రి కూడా ఓ స్టార్ హీరో కావడం విశేషం. అతనికి సైతం భారీగా ఫాలోయింగ్ ఉంది. అలాగే ఈ బుజ్జాయి మావయ్య కూడా మరో స్టార్ హీరోనే. గుర్తుపట్టండి ఎవరో. తను మరెవరో కాదండి.. యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య. అక్కినేని నాగార్జున నటవారసుడిగా జోష్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాడు. మొదటి సినిమా ఆశించిన స్తాయిలో ఆకట్టుకోలేకపోయిన నటనపరంగా మంచి మార్కులే అందుకున్నాడు చైతూ. ఏమాయ చేసావే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చైతూ.. ఆ తర్వాత వరుస సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఈ సినిమాతో చైతూ క్రేజ్ మారిపోయింది. 100% లవ్, దడ, బెజవాడ, తఢాఖా, మనం, ఒక లైలా కోసం, ప్రేమమ్, శైలజా రెడ్డి అల్లుడు వంటి సినిమాతో సూపర్ హిట్స్ అందుకున్నాడు.
ఇటీవల శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు చైతూ. ఏమాయ చేసావే సినిమా సమయంలోనే హీరోయిన్ సమంతతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇరువురి కుటుంబసభ్యుల సమక్షంలో 2017 అక్టోబర్ 6న వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. అయితే టాలీవుడ్ అన్యోన్య దంపతులుగా ఉన్న వీరు గతేడాది విడాకులు ప్రకటించి షాకిచ్చారు. ప్రస్తుతం ఎవరి లైఫ్ వారు లీడ్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.