Pakka Commercial: ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన ‘పక్కా కమర్షియల్’ టీమ్.. ప్రెస్ మీట్

మ్యాచో హీరో గోపీచంద్ నటిస్తున్న తాజాగా చిత్రం పక్కా కమర్షియల్. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మారుతి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

Pakka Commercial: ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన 'పక్కా కమర్షియల్' టీమ్.. ప్రెస్ మీట్
Pakka Commercial
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 03, 2022 | 6:28 PM

మ్యాచో హీరో గోపీచంద్ నటిస్తున్న తాజాగా చిత్రం పక్కా కమర్షియల్(Pakka Commercial). టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మారుతి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా ప్రతి రోజు పండగే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మారుతి. ఇప్పుడు పక్కా కమర్షిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా దూసుకుపోతున్న జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ క‌లిసి మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. పక్కా కమర్షియల్ టైటిల్ కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధ‌ర‌ణ ప్రేక్షకుల వ‌రకు అంతటా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించ‌డం విశేషం.

ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా ప్రఙమోషన్స్ స్పీడ్ పెంచింది. తాజాగా పక్కా కమర్షియల్ చిత్ర బృందం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారని  తెలుస్తుంది. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి