‘ఆహా’ ఓటీటీ ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉంది. మంచి, మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ దూసుకుపోతుంది. లాక్‌డౌన్ సమయానికి ముందే ఈ యాప్ లాంచ్ అవ్వడం సినిమా ప్రేక్షకులకు పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. లేకపోతే అన్ని రోజులు కదలకుండా ఇంట్లోనే ఉన్న తెలుగు మూవీ లవర్స్‌కు మరింత బోర్ కొట్టేది. 100 పర్సంట్ తెలుగు కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులకు అంతకంతకు చేరువవుతుంది ‘ఆహా’. భారీగా సబ్‌స్క్రైబర్లను పెంచుకుంటూ అడుగులు ముందుకు వేస్తుంది. ఇందులో తెలుగు సినిమాలు, షోలు, వెబ్ సిరీస్‌లు మాత్రమే ఉంటాయి కాబట్టి.. నెట్ ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్ లాగా భారీ బడ్జెట్ ఇన్వెస్ట్ చేయలేరు. సో… పరిమిత బడ్జెట్లో క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలి. ఆ దిశగా పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది ‘ఆహా’. ఇప్పటికే ‘భానుమతి రామకృష్ణ’, ‘కలర్ ఫోటో’ లాంటి మంచి సినిమాలను ఎక్స్‌క్లూజివ్‌గా అందించింది. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ వాళ్లతో కలిసి పంచుకుంది. త్వరలోనే ‘మా వింత గాథ వినుమా’ సినిమాను ఎక్స్‌క్లూజివ్‌గా తన సబ్‌స్క్రైబర్ల కోసం తీసుకొస్తుంది. ‘అనగనగా ఓ అతిథి’ పేరుతో మరో సినిమాను లైన్లో పెట్టింది. కృష్ణ చైతన్య, పాయల్ రాజ్‌పుత్ ఇందులో కీ రోల్స్ పోషించారు. కన్నడలో విజయవంతమైన ఆ కరాళ రాత్రి చిత్రాన్ని దాని దర్శకుడు దయాల్ పద్మనాభన్ తెలుగులో రీమేక్ చేశాడు. ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబరు 13 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవ్వనుంది. ఇక ఇతర భాషల్లో మంచి విజయాలు సాధించిన సినిమాలను డబ్ చేసి తన ప్రేక్షకులకు అందిస్తుంది ‘ఆహా’. ఇలా తెలుగు సినిమా ప్రేక్షకులకు సాధ్యమైనంత క్వాలిటీ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.
Also Read :
“మన తెలుగమ్మాయి బ్రదర్, అక్కున చేర్చుకోండి”