సూర్యుడితో మచ్చికలు ఆడుతున్న ఈ వయ్యారి.. ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఎవరో గుర్తుపట్టారా.?

హాయ్ ఫ్రెండ్స్.. మళ్లీ మీ ముందుకు మరో సెలబ్రిటీ ఫోటోతో వచ్చేశాం. ఇటీవల ఇంటర్నెట్‌లో స్టార్ హీరోలు, హీరోయిన్లకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు, రేర్ పిక్స్ బాగా ఫేమస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ హీరోయిన్ ఫోటో వైరల్‌గా మారింది. ఈమె ఒక్క చిత్రంతోనే..

సూర్యుడితో మచ్చికలు ఆడుతున్న ఈ వయ్యారి.. ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఎవరో గుర్తుపట్టారా.?
Viral Photo
Follow us

|

Updated on: Apr 18, 2024 | 9:16 AM

హాయ్ ఫ్రెండ్స్.. మళ్లీ మీ ముందుకు మరో సెలబ్రిటీ ఫోటోతో వచ్చేశాం. ఇటీవల ఇంటర్నెట్‌లో స్టార్ హీరోలు, హీరోయిన్లకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు, రేర్ పిక్స్ బాగా ఫేమస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ హీరోయిన్ ఫోటో వైరల్‌గా మారింది. ఈమె ఒక్క చిత్రంతోనే ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. ఈమె తన అందంతో కుర్రాళ్లను ఫిదా చేయడమే కాదు.. ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా అమాంతం పెంచుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ సినిమా అప్‌డేట్స్, గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో హీట్ రేపుతుంది. మరి ఆమె ఎవరో కనిపెట్టారా.? ఇంకా లేదా.? అయితే మీకో క్లూ.! ఈ బ్యూటీ చేసిన మొదటి సినిమా చూసిన కుర్రాళ్లు.. రియల్‌గా తమకు కూడా ఇలాంటి లవరే కావాలని కోరుకున్నారు. అంతలా ఆ మూవీలోని పాత్రకు ఈమె జీవం పోసింది.

మీకు ఇంకా ఆమె ఎవరో తెలియలేదు కదా.! మేమే చెప్పేస్తున్నాం.. ఎవరో కాదు.. తమిళ నటి దివ్యభారతి. జీవి ప్రకాశ్ కుమార్ హీరోగా వచ్చిన ‘బ్యాచిలర్’ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ వయ్యారి. తొలి చిత్రంతోనే పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. బోల్డ్ సీన్స్, లిప్‌లాక్‌లతో రెచ్చిపోయి.. కుర్రాళ్లకు హీట్ పుట్టించింది.

ఈమె అందానికే కాదు.. నటనకు కూడా యువత మంత్రంముగ్దులయ్యారు. ప్రస్తుతం తెలుగులో సుడిగాలి సుధీర్ సరసన ‘గోట్ – గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇక ఇన్‌స్టాలో ఈమెకున్న ఫాలోయింగ్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఇన్‌స్టాలో ఈమెకు ప్రస్తుతం 3.4 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.