AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: రామ్ చరణ్‌కి అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌లో క్వీన్ ఎలిజబెత్ II తర్వాత గ్లోబల్ స్టార్

2017లో ప్రారంభమైన IIFA, మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్ మధ్య భాగస్వామ్యం ప్రపంచ వేదికపై భారతీయ సినిమా వేడుకలను ఒకచోట చేర్చి, అభిమానులను తమ అభిమాన తారలతో ప్రత్యేకమైన రీతిలో నిమగ్నమయ్యేలా కొనసాగిస్తోంది. 

Ram Charan: రామ్ చరణ్‌కి అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌లో క్వీన్ ఎలిజబెత్ II తర్వాత గ్లోబల్ స్టార్
Ram Charan
Rajeev Rayala
|

Updated on: Oct 24, 2024 | 7:40 AM

Share

గ్లోబల్ రామ్ చరణ్ మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్‌లో మైనపు బొమ్మతో తన గ్లోబల్ స్టార్‌డమ్‌ను చిరస్థాయిగా మార్చుకోబోతున్నారు. 2025 వేసవిలో రామ్ చరణ్ మైనపు బొమ్మ ఆవిష్కరించనున్నారు. అబుదాబిలో జరిగిన స్టార్-స్టడెడ్ 2024 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) అవార్డ్స్‌లో ఈ ప్రకటన చేశారు. చలనచిత్ర రంగానికి ఆయన చేసిన విశేషమైన సేవలకు, ప్రపంచవ్యాప్త ఆకర్షణకు గుర్తింపుగా చరణ్ “మేడమ్ టుస్సాడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అవార్డు”ని అందించారు.

ఇది కూడా చదవండి : Tollywood: అందంలో అమ్మనే మించిపోయిందిగా..! కేసీఆర్ మూవీ హీరోయిన్ ఆ టాలీవుడ్ నటి కూతురా..!!

సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రతిష్టాత్మకమైన సూపర్‌స్టార్ల లైనప్‌లో చేరడం నిజంగా గౌరవంగా భావిస్తున్నట్లు రామ్ చరణ్ తెలిపారు. చిన్నప్పుడు, దిగ్గజ నటుల జీవితకాలపు వ్యక్తులను చూసి నేను ఆశ్చర్యపోయే వాడిని. ఏదో ఒక రోజు వారి మధ్య నేను కూడా ఉంటానని కలలో కూడా అనుకోలేదు. ఇది అద్భుతమైన అవకాశం. మేడమ్ టుస్సాడ్స్ ఇస్తున్న ఈ గుర్తింపు నా క్రాఫ్ట్ పట్ల కృతజ్ఞతతో ఉన్నాను అని అన్నారు.

ఇది కూడా చదవండి :దొరికేసింది మావ.. మొత్తానికి దొరికేసింది.. సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ బ్యూటీ ఎవరంటే

రామ్ చరణ్ కటౌట్ కి ఒక ప్రత్యేకమైన టచ్ జోడిస్తూ, రామ్ చరణ్ ప్రియమైన పెంపుడు జంతువు రైమ్ కూడా ఈ మైనపు బొమ్మలో కలిసి ఉందనుడటం విశేషం. దీంతో క్వీన్ ఎలిజబెత్ II కాకుండా, వారితో పాటు ఒక పెంపుడు జంతువుతో కూడిన మైనపు బొమ్మ కలిగిన ఏకైక సెలబ్రిటీగా చెర్రీ నిలవబోతున్నారు. ఈ స్పెషల్ ఎక్స్‌పీరియన్స్‌లో రైమ్ నాతో చేరడం ఎంతో సంతోసహాయంగా ఉంది. రైమ్ నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం, నా వ్యక్తిగత జీవితంతో ఎంతో ముడిపడి ఉన్న అంశజం అని రామ్ చరణ్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : Actress : రెండు పెళ్లిళ్లు, ఇద్దరు పిల్లలు.. రెండుసార్లు విడాకులు.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా..

2017లో ప్రారంభమైన IIFA, మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్ మధ్య భాగస్వామ్యం ప్రపంచ వేదికపై భారతీయ సినిమా వేడుకలను ఒకచోట చేర్చి, అభిమానులను తమ అభిమాన తారలతో ప్రత్యేకమైన రీతిలో నిమగ్నమయ్యేలా కొనసాగిస్తోంది. “IIFAతో మా భాగస్వామ్యాన్ని కొనసాగించడం, మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్‌లో ప్రతిష్టాత్మకమైన భారతీయ సినిమా దిగ్గజాల శ్రేణికి రామ్ చరణ్‌ను స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము” అని మెర్లిన్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లోని గేట్‌వే ఆసియా రీజినల్ డైరెక్టర్ అలెక్స్ వార్డ్ అన్నారు. “ఈ భాగస్వామ్యం భారతీయ సినిమా యొక్క ప్రపంచ ప్రభావాన్ని ప్రదర్శించడానికి, మా అతిథులకు చిరస్మరణీయ అనుభవాలను అందించడానికి మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది” అని తెలిపారు. రామ్ చరణ్ మైనపు బొమ్మను జోడించడం వలన మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్‌లో ఇప్పటికే ఉన్న “IIFA జోన్” మరింత బలోపేతం కానుంది. ఇందులో ఇప్పటికే షారూఖ్ ఖాన్, కాజోల్, కరణ్ జోహార్, అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజ భారతీయ సినీ తారల బొమ్మలు ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.