Ram Charan : సుకుమార్ కూతురిని మెచ్చుకున్న రామ్ చరణ్, ఉపాసన.. గాంధీ తాత చెట్టు’ టీమ్‌ గ్లోబల్‌ స్టార్‌ ప్రశంసలు..

డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో సుకృతి వేణి నటనను సినీప్రియులు మెచ్చుకుంటున్నారు. తాజాగా రామ్ చరణ్ అభినందించారు. తాజాగా రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన గాంధీ తాత చెట్టు మూవీ టీంను అభినందించారు.

Ram Charan : సుకుమార్ కూతురిని మెచ్చుకున్న రామ్ చరణ్, ఉపాసన.. గాంధీ తాత చెట్టు టీమ్‌ గ్లోబల్‌ స్టార్‌ ప్రశంసలు..
Ram Charan, Upasana

Updated on: Jan 25, 2025 | 9:40 PM

ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, గోపీ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీమతి తబితా సుకుమార్‌ సమర్పకురాలు. నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, శేష సింధురావు నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందారు. కాగా ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌ విడుదల చేశారు మేకర్స్‌.

ఈ చిత్రం విడుదలై మంచి ప్రశంసలు దక్కించుకుంటుంది. సినిమా అందరి హృదయాలకు హత్తకుంటుంది. మంచి సామాజిక సందేశంతో కూడిన ఈ చిత్రంలో లీడ్‌ రోల్‌ పోషించిన సుకృతి వేణి నటనకు అందరూ ఫిదా అయిపోతున్నారు. 13 ఏళ్ల అమ్మాయిగా గాంధీ పాత్రలో ఆమె సహజ నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీమ్‌ను గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, ఆయన సతీమణి ఉపాసనలు ఈ చిత్రం టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

సుకృతికి ఆమె నటనకు వస్తున్న రెస్పాన్స్‌ పట్ల రామ్‌చరణ్‌, ఉపాసనలు అభినందనలు తెలియజేశారు. గాంధీ తాత చెట్టు టీమ్‌తో కాసేపు ముచ్చటించారు. రామ్‌చరణ్‌, ఉపాసనలను కలిసిన వారిలో చిత్ర సమర్పకురాలు శ్రీమతి తబితా సుకుమార్‌, దర్శకురాలు పద్మ, నిర్మాత సింధు, రాగ్‌మయూర్‌, భాను ప్రకాష్‌, నేహాల్‌ తదితరులు ఉన్నారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..