Genilia D Souza: సౌత్ సినిమాలపై విమర్శలు.. యాంకర్‏కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన జెనీలియా..

ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో జెనీలియా ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి నటిగా మంచి మార్కులు కొట్టేసింది. కానీ పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమై ఫ్యామిలీకే పరిమితమైపోయింది. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ కే స్ట్రాంగ్ కౌంటరిచ్చింది.

Genilia D Souza: సౌత్ సినిమాలపై విమర్శలు.. యాంకర్‏కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన జెనీలియా..
Genelia Crazy

Updated on: Jun 20, 2025 | 9:57 PM

హీరోయిన్ జెనీలియా.. సౌత్ సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలోనూ అనేక హిట్ చిత్రాల్లో నటించింది. అలాగే హిందీలోనూ ఎన్నో సూపర్ హిట్స్ చేసింది. బీటౌన్ హీరో రితేశ్ దేశ్ ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న జెనీలియా.. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఆమె నటించిన సినిమా సితారే జమీన్ పర్. ఇందులో అమీర్ ఖాన్ జోడిగా కనిపించింది. జూన్ 20న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జెనీలియాకు సౌత్ సినిమాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. సౌత్ మూవీస్ హీరోయిన్స్ రోల్స్ పై ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు స్ట్రాంగ్ కౌంటరిచ్చింది.

సౌత్ సినిమాల్లో హీరోయిన్లకు బలమైన పాత్రలు లభిస్తాయా ? అని యాంకర్ అడగ్గా.. ఆమె స్పందిస్తూ.. బలమైన పాత్రలు లభించవని అనుకోవడాన్ని ఖండించారు జెనీలియా. ఆమె మాట్లాడుతూ.. “ఒకసారి నేను నటించిన దక్షిణాది సినిమాలు చూడండి. నాకు మంచి పాత్రలు దక్కాయి. నటనలో నేను ఎక్కువ విషయాలు నేర్చుకుంది అక్కడే. మంచి అవకాశాలు అందించిన సౌత్ ఇండస్ట్రీకి నేను రుణపడి ఉంటాను. నేను హైదరాబాద్‌కు వెళితే, వారు ఇప్పటికీ నన్ను హాసిని (బొమ్మరిల్లు చిత్రంలోని పాత్ర) అని పిలుస్తారు. తమిళంలో, వారు నన్ను హరిణి అని పిలుస్తారు. ఇలాంటి పాత్ర లభించడం నా అదృష్టం” అంటూ చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

అలాగే తనకు శంకర్, రాజమౌళి వంటి దర్శకులతో, కొత్త సాంకేతిక నిపుణులతో పనిచేసే అవకాశం లభించడం పట్ల సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. ఇక ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన జెనీలియా.. త్వరలోనే మరిన్ని సినిమాల్లో నటించనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..