
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ గొప్ప హీరో మాత్రమే కాదు, ఆయన ప్రపంచంలోని అత్యంత ధనిక నటులలోఒకరు. షారుఖ్ ఖాన్ బాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాడు. టీవీరంగంలో తన నట జీవితాన్ని ప్రారంభించిన కింగ్ ఖాన్ నేడు కోట్లాది రూపాయలకు యజమాని. కొన్ని నెలల క్రితం విడుదలైన జవాన్, అంతకు ముందు పఠాన్, షారుఖ్ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. జీరో నుంచి కెరీర్ ప్రారంభించిన షారుక్ ఖాన్.. కష్టపడి ఈరోజు ఈ స్థానానికి చేరుకున్నాడు. అయితే షారుఖ్ మాత్రమే కాదు అతని లేడీ లవ్ అంటే అతని భార్య గౌరీ ఖాన్ కూడా తన భర్తలాగే ధనవంతురాలు. గౌరీ ఖాన్ షారుక్ భార్యగా మాత్రమే కాకుండా ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గా రాణిస్తున్నారు.
ప్రస్తుతం గౌరీ ఖాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. గౌరీ ఖాన్ ఇటీవల ముంబైలో ‘టోరీ’ అనే లగ్జరీ రెస్టారెంట్‌ను ప్రారంభించింది. దీని ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. డిజైనర్ గానే కాకుండా గౌరీ ఖాన్ రెస్టారెంట్ వ్యాపారంలో కూడా స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చింది. వృత్తిరీత్యా ఇంటీరియర్ డిజైనర్, గౌరీ ఖాన్ ఇప్పుడు తన సొంత రెస్టారెంట్‌ను కూడా నడుపుతోంది. గౌరీ ఖాన్ తన కష్టార్జితంతో తన వ్యాపారాన్ని మొదలు పెట్టి నేడు విజయవంతమైన వ్యాపారవేత్తగా మారింది. గౌరీ ఖాన్ కూడా తన భర్త షారూఖ్ ఖాన్ లా కోట్లు సంపాదిస్తుంది.
షారుక్ ఖాన్ లాగే ఆయన భార్య గౌరీ ఖాన్ కూడా కోట్లాది సంపదకు యజమాని. బీ టౌన్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆమె ఆస్తి విలువ మొత్తం 1725 కోట్ల రూపాయలు. షారుక్ ఖాన్ ఆస్తి విలువ మొత్తం 760 మిలియన్ డాలర్లు కాగా గౌరీ ఖాన్ ప్రతి సంవత్సరం దాదాపు 100 కోట్లు సంపాదిస్తుంది.
ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌరీ.. పలువురు బాలీవుడ్ తారలతో పాటు వ్యాపారవేత్తలు, వీఐపీల ఇళ్లను అందంగా డిజైన్ చేశారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రణబీర్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, కత్రినా కైఫ్, అనన్య పాండే ,కరణ్ జోహార్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖుల ఇళ్లను గౌరీ డిజైన్ చేసింది. ఇది మాత్రమే కాదు, ఆమె ముఖేష్ అంబానీ, రాబర్టో కావల్లి, రాల్ఫ్ లారెన్ వంటి ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తుల ఇళ్లను కూడా డిజైన్ చేసింది.అలాగే గౌరీ విజయవంతమైన నిర్మాత కూడా. ఆమె 2002లో సినిమాలను నిర్మించడం ప్రారంభించింది. 2002లో తన భర్త షారూఖ్ ఖాన్‌తో కలిసి ‘రెడ్ చిల్లీస్’ అనే ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించింది. ఈ ప్రొడక్షన్ హౌస్ ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.