Gangs of Godavari Review: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ.. విశ్వక్ సేన్ హిట్టు కొట్టాడా.. ?

| Edited By: Rajitha Chanti

May 31, 2024 | 12:12 PM

డిఫెరెంట్ సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు విశ్వక్ సేన్. ధమ్కీ, గామి లాంటి విజయాల తర్వాత ఈయన నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Gangs of Godavari Review: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ.. విశ్వక్ సేన్ హిట్టు కొట్టాడా.. ?
Gangs Of Godavari Review
Follow us on

మూవీ రివ్యూ: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి

నటీనటులు: విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి, గోకరాజు రమణ, నాజర్, హైపర్ ఆది తదితరులు

ఎడిటర్: నవీన్ నూలి

సినిమాటోగ్రఫీ: అనిత్ మదాడి

సంగీతం: యువన్ శంకర్ రాజా

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కృష్ణ చైతన్య

నిర్మాత: సూర్యదేవర నాగవంశీ

డిఫెరెంట్ సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు విశ్వక్ సేన్. ధమ్కీ, గామి లాంటి విజయాల తర్వాత ఈయన నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

ఊరిలో పనీ పాటా లేకుండా తిరిగే ఒక కుర్రాడు లంకల రత్న (విశ్వక్ సేన్). ఆ ఊళ్లో ఎమ్మెల్యే చేస్తున్న అన్యాయాలను చూసి అస్సలు తట్టుకోలేకపోతాడు. తను కూడా రాజకీయాల్లోకి వచ్చి వాళ్లకు ఎదురు తిరుగుతాడు. వాళ్లకు ధీటుగా ఇల్లీగల్ పనులు చేసుకుంటూ చాలా వేగంగా ఎదుగుతాడు. రాజకీయాల్లోకి మార్పు కోసం వచ్చి తనే మారిపోతాడు. మరోవైపు లంకల రత్న జీవితంలో బుజ్జి (నేహా శెట్టి) ఉంటుంది. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. మరోవైపు రత్నమాల (అంజలి)తోనూ రిలేషన్‌లో ఉంటాడు. ఈ క్రమంలోనే లంకల రత్న జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది. చివరికి తను అనుకున్నది సాధించాడా లేదా అనేది పూర్తి కథ..

కథనం:

రౌడీ ఫెల్లో, చల్ మోహన్ రంగ సినిమాల్లో ఎక్కువగా కామెడీ ఉంటుంది. రౌడీ ఫెల్లోలో యాక్షన్ ఉన్నా కూడా.. లోపల కామెడీ ట్రాక్‌తోనే సినిమాను నడిపించాడు దర్శకుడు కృష్ణ చైతన్య. కానీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అలా కాదు.. ఇది చాలా డిఫెరెంట్ సినిమా. ఇలాంటి కథను మాస్ యాంగిల్‌లో చెప్పాలనుకోవడం కూడా సాహసమే. అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ముఖ్యంగా విశ్వక్ సేన్ లాంటి హీరోను తీసుకున్నపుడే ఈ సినిమాకు సగం న్యాయం జరిగింది. లంకల రత్న పాత్రలో విశ్వక్ ఒదిగిపోయాడు. సినిమా మొదలైన కాసేపటికే ఆ కారెక్టర్‌తో ప్రేమలో పడిపోతాం.. దాంతోనే ట్రావెల్ అయిపోతాం. కథలో ఏం జరుగుతుంది.. కథనం ఏంటి.. స్లోగా ఉందా ఇలాంటి ఆలోచనలు రాకుండా పూర్తిగా హీరో పాత్రతోనే కథను ముందుకు తీసుకెళ్లాడు కృష్ణ చైతన్య. ఫస్ట్ హాఫ్‌లో హీరో కారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికి కాస్త టైమ్ తీసుకున్నాడు దర్శకుడు.. కానీ ఆ తర్వాత వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌కు ముందే వచ్చే ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. కనీసం బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా లేకుండా వచ్చే ఆ ఫైట్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అలాగే ట్రక్ ఫైట్ కూడా అదిరిపోయింది. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త స్లోగా ఉంటుంది కానీ ఎమోషన్స్ బాగున్నాయి. రాజకీయాల్లో ఉండే లొసుగులు వాడుకుంటూ హీరో ఎలా పైకి ఎదిగాడు.. ఆ తర్వాత ఎలా దిగజారాడు అనేది కూడా పక్కాగా చూపించాడు కృష్ణ చైతన్య. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చాలా వరకు తెలిసిన కథలాగే అనిపిస్తుంది కానీ ఎంగేజింగ్‌గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ముఖ్యంగా కారెక్టర్ డ్రివెన్‌గానే సినిమా వెళ్లిపోతుంది. సినిమాగా కంటే కూడా సీన్స్ పరంగా చూసుకుంటే ఈ చిత్రం అద్బుతంగా ఉంటుంది. అంజలి, విశ్వక్ సేన్ మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి.. అలాగే గోకరాజు రమణ సీన్స్ కూడా చాలా బాగున్నాయి.

నటీనటులు:

విశ్వక్ సేన్ లంకల రత్న పాత్రకు ప్రాణం పోసాడు. ఆ కారెక్టర్ కోసమే పుట్టాడేమో అనేంతగా ఒదిగిపోయాడు. యాస కూడా చాలా బాగా మాట్లాడాడు. నేహా శెట్టి కారెక్టర్ బాగుంది. బుజ్జి పాత్రలో చాలా బాగా నటించింది. అంజలి పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా విశ్వక్ సేన్‌ను సపోర్ట్ చేసే పాత్రలో అద్భుతంగా నటించింది. నాజర్, హైపర్ ఆది, గోకరాజు రమణ లాంటి నటులు తమ పాత్రలకు న్యాయం చేసారు.

టెక్నికల్ టీం:

సినిమాకు యువన్ శంకర్ రాజా ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయింది. ఆర్ఆర్ చాలా బాగుంది. పాటలు కూడా బాగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ వర్క్ ఓకే.. గోదావరి సీన్స్ చాలా బాగా చూపించాడు కెమెరా మెన్ అనిత్. అలాగే నవీన్ నూలి ఎడిటింగ్ చాలా షార్ప్‌గా ఉంది. దర్శకుడు కృష్ణ చైతన్య రైటింగ్ పవర్ బాగుంది. అతడిలోని దర్శకుడిని రైటర్ డామినేట్ చేసాడు. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి.

పంచ్ లైన్:

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. మాస్ ఆడియన్స్‌కు పండగే పండగ..