గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. అంజలి మరో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. యస్ .జె. సూర్య, సునీల్, శ్రీకాంత్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా గేమ్ ఛేంజర్ సినిమాను నిర్మించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య శుక్రవారం (జనవరి 10) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని చోట్లా ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో చిన్న మార్పు చేసినట్లు గే్ ఛేంజర్ టీమ్ వెల్లడించింది. సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్న మెలోడీ సాంగ్ ‘నానా హైరానా’ ను తొలగించినట్లు తెలిపింది. జనవరి 14 నుంచి ఈ పాట అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. కాగా సినిమా రిలీజ్ కుముందే నానా హైరానా సాంగ్ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సాంగ్ విజువల్స్, కియారా అందం, రామ్ చరణ్ గ్రేస్ తో ఈ సాంగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. సుమారు రూ. 10 కోట్ల ఖర్చుతో ఈ పాటను తెరకెక్కించారు. న్యూజిలాండ్‌లో 6 రోజుల పాటు దీని షూటింగ్ జరిగింది. తమన్ సంగీతం అందించగా రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యంసంగీతాభిమానులను ఎంతో ఆకట్టుకుంది. ఈ గీతాన్ని కార్తిక్, శ్రేయా ఘోషల్ ఆలపించారు.
ఇలా ఎన్నో విశేషాలున్న నానా హైరానా సాంగ్ థియేటర్లలో చూడాలని చాలామంది ఆశపడ్డారు. కానీ గేమ్ ఛేంజర్ సినిమా కోసం థియేటర్లకు వెళ్లిన జనాలకు ఈ సాంగ్ అసలు కనిపించలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. దీనిపై గేమ్ ఛేంజర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఈ పాటను ప్రస్తుతం ప్రదర్శించలేకపోతున్నట్లు టీమ్ ప్రకటించింది.
‘అందరికీ ఇష్టమైన ‘నానా హైరానా’ పాట ఇన్‌ఫ్రారెడ్ ఇమేజ్‌ల ప్రాసెసింగ్‌లో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఈ కారణంగా ప్రస్తుతం దీన్ని ప్రదర్శించలేకపోతున్నాం. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తాం. జనవరి 14 నుంచి ఈ పాటను సినిమాలో జోడిస్తాం. దీనికోసం మా టీమ్ అంతా రాత్రి, పగలు కష్టపడి పనిచేస్తోంది’ అని గేమ్ ఛేంజర్ టీమ్ తెలిపింది.
Everyone’s favorite, #NaanaaHyraanaa | #Lyraanaa | #JaanaHairaanSa from #GameChanger
has been edited out due to technical challenges encountered during the processing of infrared images in the initial prints. Rest assured, we are diligently working towards adding the song back… pic.twitter.com/N1mQO2GAG6— Game Changer (@GameChangerOffl) January 9, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.