GA2 Pictures : అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న సినిమా.. దర్శకుడు ఎవరంటే..

|

Oct 31, 2021 | 7:48 PM

పెద్ద సినిమాలతోపాటు చిన్న సినిమాలను తెరకెక్కిస్తూ నూతన దర్శకులను కుర్ర హీరోలను ప్రోత్సహిస్తుంది గీత ఆర్ట్స్ సంస్థ.

GA2 Pictures : అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న సినిమా.. దర్శకుడు ఎవరంటే..
Anjali
Follow us on

GA2 Pictures: పెద్ద సినిమాలతోపాటు చిన్న సినిమాలను తెరకెక్కిస్తూ నూతన దర్శకులను కుర్ర హీరోలను ప్రోత్సహిస్తుంది గీత ఆర్ట్స్ సంస్థ. ఇప్పటికే పలు విజయవంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించిన జీఏ 2 పిక్చ‌ర్స్ ఇప్పుడు మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చ‌ర్స్ బ్యానర్ లో బన్నీ వాసు, విద్య మాధురి నిర్మాతలుగా నూత‌న చిత్రం ప్రారంభమైంది. వ‌రుస స‌క్సెస్ ఫుల్ సినిమాల‌తో తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకొని విజ‌య‌వంత‌మైన సినిమాల‌ను నిర్మిస్తున్న సినీ నిర్మాణ సంస్థ‌గా ఇమేజ్ అందుకున్న జీఏ2పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ నుంచి ప్రొడ‌క్ష‌న్ 7గా ఈ నూత‌న చిత్రం రాబోతుంది.

పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలతో ప్రేక్ష‌కాధ‌‌ర‌ణ అందుకున్న ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్ర‌ముఖ హీరోయిన్ అంజ‌లి, ప్ర‌ముఖ న‌ట‌లు రావు ర‌మేశ్, ప్రియ‌ద‌ర్శీ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైర‌క్ట‌ర్ మెలోడీ బ్ర‌హ్మా మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఫిల్మ్ న‌గ‌ర్ దైవ స‌న్నిధానంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ సినిమా మొద‌లైంది, అల్లు అన్విత క్లాప్ ఇచ్చి ఈ సినిమాను ప్రారంభించారు, అల్లు అరవింద్ గారు కెమెరా స్విచ్ఛ్ ఆన్ చేశారు. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Allu Arjun and Vijay Devarakonda: ఐకాన్ స్టార్ అండ్ రౌడీ హీరో… ఇద్దరికీ అదొక్కటే మ్యూచ్యువల్ టార్గెట్!!

Ramya Krishnan: చిన్నాపెద్దా అన్ని సినిమాలకు కమర్షియల్ ఎలిమెంట్‌గా ఎవర్‌ గ్రీన్ క్వీన్

Puneeth Rajkumar: 13 ఏళ్ళ తర్వాత డీపీ మార్చిన హీరో.. ప్రాణ స్నేహితుడికి ఇంతకన్నా నివాళి ఉంటుందా.