AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raghavendra Rao: శ్రీదేవిని చివరిసారిగా కలిసింది అప్పుడే.. కానీ.! అలాంటి మరణం ఎవరికీ రాకూడదు

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు శ్రీదేవితో తన అనుబంధాన్ని, ఆమె అకాల మరణంపై తన భావోద్వేగాలను పంచుకున్నారు. 50 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ను 110 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన, ఎన్.టి. రామారావుతో "అడవిరాముడు" చిత్రాన్ని, ఆ తర్వాత రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్లనుయ పరిచయం చేసిన తీరును వివరించారు.

Raghavendra Rao: శ్రీదేవిని చివరిసారిగా కలిసింది అప్పుడే.. కానీ.! అలాంటి మరణం ఎవరికీ రాకూడదు
Raghavendra Rao
Ravi Kiran
|

Updated on: Mar 31, 2026 | 1:55 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘దర్శకేంద్రుడు’గా గుర్తింపు తెచ్చుకున్న కె. రాఘవేంద్రరావు తన 50 ఏళ్ల కెరీర్‌లోని మధుర స్మృతులను పంచుకున్నారు. ఎన్.టి.ఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి లాంటి దిగ్గజ నటులతో పనిచేసిన ఆయన, తన కెరీర్‌లో అత్యధికంగా అతిలోక సుందరి శ్రీదేవితో 24 సినిమాలు చేయడం విశేషం. ఆమెతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, తన చివరి చిత్రం ‘మామ్’ వేడుకలో తన పాదాలకు నమస్కరించి 25వ సినిమా చేయాలని కోరిన శ్రీదేవి, అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోవడం తనను ఎంతో కలిచివేసిందని భావోద్వేగానికి లోనయ్యారు. నిర్మాతల శ్రేయస్సు కోరి అతి తక్కువ రోజుల్లోనే(అడవిరాముడు 38 రోజుల్లో) సినిమాలను పూర్తి చేసే క్రమశిక్షణ రాఘవేంద్ర రావు సొంతం.

రాఘవేంద్రరావు కేవలం గొప్ప దర్శకుడే కాకుండా, ఎస్.ఎస్. రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడిని పరిశ్రమకు పరిచయం చేసిన ఘనుడు. ‘శాంతినివాసం’ సీరియల్ సమయంలో రాజమౌళి ప్రతిభను గుర్తించి, ‘స్టూడెంట్ నెంబర్ 1’తో అతన్ని దర్శకుడిగా పరిచయం చేశారు. దానికి ప్రతిఫలంగా రాజమౌళి తనకు ‘బాహుబలి’ వంటి ప్రపంచ స్థాయి చిత్రాన్ని బహుమతిగా ఇచ్చాడని ఆయన గర్వంగా చెప్పుకున్నారు. తన తండ్రి ప్రకాష్ ప్రొడక్షన్స్ కోల్పోయిన వైభవాన్ని తిరిగి తీసుకురావాలనే పట్టుదలతో దర్శకుడిగా మారిన ఆయన, 110 చిత్రాలకు దర్శకత్వం వహించి అద్భుత విజయాలను అందుకున్నారు. అందులో 70కి పైగా చిత్రాలు వంద రోజులు ఆడటం ఒక రికార్డు.

మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్తతరం రాకను ఆయన స్వాగతిస్తారు. ‘కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్లాల్సిందే’ అనే సూత్రాన్ని నమ్మే ఆయన, పాత క్లాసిక్ చిత్రాలను రీమేక్ చేయడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ వంటి సినిమాల్లోని ఇళయరాజా సంగీతాన్ని, ఆ నటీనటుల ముద్రను మార్చడం అసాధ్యమని పేర్కొన్నారు. తన విజయ ప్రయాణంలో తోడున్న నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us