పాప్ సింగర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నారు సింగర్ స్మిత. కేవలం సింగర్‌గానూ కాకుండా.. నటనలోనూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అయితే తన గాత్రంలో శ్రోతలను అలరించడమే కాకుండా.. కరోనా కష్టాల్లోనూ అండగా నిలుస్తానని మరోసారి నిరూపించుకుంది. ప్రస్తుతం దేశం ఎదుర్కోంటున్న క్లిష్ట పరిస్థితుల గురించి తెలిసిందే. కరోనా కష్టాల్లో ఆసుపత్రులలో బెడ్స్ దొరక్కా.. ఆక్సిజన్ సిలిండర్స్ లభించక ఎంతో మంది ప్రాణాలు పోగోట్టుకున్నారు. దీంతో ఎంతో మంది ప్రముఖులు తమకు చేతనైనా సాయం చేశారు. అలాంటి విపత్కర పరిస్థితులలో సింగర్ స్మిత కూడా కరోనా రోగులకు సాయం చేశారు. తన టీంతో కలిసి వంద ఆక్సిజన్ బెడ్స్‌ను కోవిడ్ ఆసుపత్రులకు పంపిణి చేశారు.
తాజాగా స్మిత మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. రేపు (జూలై 29న) హైదరాబాద్‌లోని గోషామహాల్లో ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించబోతున్నట్లుగా స్మిత తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా స్మిత తన ట్విట్టర్ ఖాతాలో.. రేపు రేపు (జూలై 29న) హైదరాబాద్‌లోని గోషామహాల్లో ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించబోతున్నాము. 1000పైగా వ్యాక్సిన్స్ కోసం విరాళం ఇచ్చినందుకు ARS సొల్యూషన్స్ USకి ధన్యవాదాలు. నమోదు లేదా హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి. స్పాట్ రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉన్నాయి అంటూ ట్వీట్ చేశారు. ఫ్రీ వ్యా్క్సినేషన్ డ్రైవ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
స్థలం ఎక్కడంటే..
సుందర వచనాలయం. లాల్ భవన్. తకూర్ వాడీ. గోషామహాల్. హైదరాబాద్.
ట్వీట్..
A free vaccination drive tomorrow, 29th July at Ghoshamahal. Thanks to ARS Solutions US for donating towards 1000+ vaccines. Pls register or call the helpline number. Spot registrations available @MedicoverIN @smitacare #SmitaCare #GetVaccinatedNow pic.twitter.com/MEsKZtJaMv
— Smita (@smitapop) July 28, 2021
SR Kalyana Mandapam: ఆకట్టుకొంటున్న ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ మూవీ ట్రైలర్..