శకుంతలగా బ్యూటీఫుల్ హీరోయిన్ సమంత ..దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ నటిస్తోన్న పౌరాణిక ప్రేమ కథా చిత్రం ‘శాకుంతలం’. ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ ఎపిక్ లవ్ స్టోరి ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది. సినిమా అనేది లార్జర్ దేన్ లైఫ్‌గా ఉండాలంటూ ప్రతి ఫ్రేమ్‌ను అద్భుతంగా తెరకెక్కించే డైరెక్టర్ గుణశేఖర్.. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంతలంను రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరక క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్టేడ్ ఇచ్చారు మేకర్స్. ప్రేమికుల రోజున అంటే ఫిబ్రవరి 14న ఈ సినిమా నుంచి ఫోర్త్ సింగిల్ మధుర గతమా అనే ఎమోషనల్ హార్ట్ టచింగ్ సాంగ్ రాబోతున్నట్లుగా అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రొమాంటిక్ పోస్టర్ రిలీజ్ చేసారు. అదే రోజు ఇతర భాషల వెర్షన్స్ కూడా రిలీజ్ కానున్నాయి. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయ అర్హ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
విజువల్ వండర్‌గా త్రీడీ టెక్నాలజీతో తెలుగు, హిందీ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో శాకుంతలం సినిమా విడుదలవుతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్.. సోషల్ మీడియాలో సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. మణి శర్మ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని విజువల్‌గానే కాకుండా మ్యూజికల్‌గానూ ఆడియెన్స్‌కు ఆమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వటానికి రీ రికార్డింగ్‌ను బుడాపెస్ట్, హంగేరిలోని సింఫనీ టెక్నీషియన్స్ వర్క్ చేశారు.
For the hearts yearning for Love ?#MadhuraGathamaa/ #MadhuraKalTu/ #MadhuraGathaBaa/ #MayakkumPozhudhe from #Shaakuntalam releasing on Feb 14th✨@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan @neelima_guna #ManiSharma @GunaaTeamworks @SVC_official @tipsofficial @tipsmusicsouth pic.twitter.com/o0YCzW3XfK
— Gunaa Teamworks (@GunaaTeamworks) February 12, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.