AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: రష్మిక బాటలోనే శ్రీలీల.. మరో బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిందిగా! ఈసారి ఆ హ్యాండ్సమ్ హీరోతో రొమాన్స్!

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు రష్మిక బాటలోనే పయనిస్తోంది. నేషనల్ క్రష్ లాగే తెలుగులో సినిమాలు చేస్తూనే వరుసగా బాలీవుడ్ ఆఫర్లు అందుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు మరో హిందీ సినిమా ఆఫర్ వచ్చింది. అది కూడా ఓ స్టార్ హీరో సినిమాలో..

Sreeleela: రష్మిక బాటలోనే శ్రీలీల.. మరో బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిందిగా! ఈసారి ఆ హ్యాండ్సమ్ హీరోతో రొమాన్స్!
Sreeleela
Basha Shek
|

Updated on: Apr 27, 2025 | 2:52 PM

Share

జయపజయాలతో సంబంధం లేకుండా తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీ లీల. అదే సమయంలో బాలీవుడ్ లోనూ బిజీ అయ్యేందుకు తెగ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా పుష్ప 2 సినిమాలో కిస్సిక్ సాంగ్ తో శ్రీలీలకు నేషనల్ వైడ్ క్రేజ్ వచ్చింది. ఇదే క్రమంలో స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయ్యింది. ఇప్పుడు ఆమెకు బాలీవుడ్ నుంచి మరో బంపర్ ఆఫర్ వచ్చింది. ఈసారి కూడా ఒక హిందీ స్టార్ హీరోతో నటించే అవకాశం దక్కించుకుంది. శ్రీలీల స్పీడ్ చూస్తుంటే రష్మిక మందన్న లాగా ఆమె కూడా బాలీవుడ్‌లో పాగా వేస్తుందో లేదో చూడాలి . ‘డ్రీమ్ గర్ల్’ ఫేమ్ రాజ్ శాండిల్య కొత్త చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది. శ్రీలీల, అనన్య పాండేలతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే శ్రీలీలకే మెయిన్ హీరోయిన్ గా అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. ‘డ్రీమ్ గర్ల్’ సినిమాను కామెడీ స్టైల్‌లో తీశారు. దర్శకుడు రాజ్ ఈ రకమైన సినిమాలతోనే ఎక్కువగా హిట్లు కొట్టాడు. ఇప్పుడు రాబోయే సినిమాలో కూడా కామెడీ ప్రధానంగానే ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అందుకే శ్రీలీల, అనన్య పాండేలతో చర్చలు జరుగుతున్నాయి.

శ్రీలీల ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్‌లో న కనిపిస్తోంది. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఒక సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేంగా జరుగుతోంది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే శ్రీలీలకు మరో క్రేజీ ఆఫర్ వచ్చింది. యాదృచ్ఛికంగా రష్మిక, సిద్ధార్థ్ గతంలో ‘మిషన్ మజ్ను’ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా నటించారు.

ఇవి కూడా చదవండి

ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే.. శ్రీలీల ప్రస్తుతం మాస్ మహారాజాతో కలిసి మాస్ జాతర అనే సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. దీంతో పాటు పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు మరికొన్ని ప్రాజెక్టులు శ్రీలీల చేతిలో ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట