Rashmika Mandanna: ఎట్టకేలకు పుష్ప 2 గురించి ఆసక్తికర విషయం బయటపెట్టిన రష్మిక.. ఏంటంటే..

|

Jan 16, 2023 | 3:04 PM

రష్మిక అల్లు అర్జున్ సరసన పుష్ప 2లోనూ కనిపించనుంది. కొద్దిరోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Rashmika Mandanna: ఎట్టకేలకు పుష్ప 2 గురించి ఆసక్తికర విషయం బయటపెట్టిన రష్మిక.. ఏంటంటే..
Rashmika Mandanna
Follow us on

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్‏గా క్రేజ్ సంపాదించుకుంది రష్మిక. ఈ మూవీతో ముద్దుగుమ్మ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఇప్పుడు సంక్రాంతి కానుకగా వచ్చిన విజయ్ దళపతి సరసన వరిసు చిత్రంతో థియేటర్లలో సందడి చేస్తుంది. తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఈ సినిమా ఏకకాలంలో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అటు హిందీలోనూ వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్ను సినిమాతో ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా జనవరి 20న విడుదల కానుంది. అయితే ఇవే కాకుండా.. రష్మిక అల్లు అర్జున్ సరసన పుష్ప 2లోనూ కనిపించనుంది. కొద్దిరోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఈ సినిమా చిత్రీకరణలో ఇప్పటికే బన్నీ, మిగతా నటీనటులు పాల్గొంటుండగా.. ఇప్పటివరకు రష్మిక జాయిన్ కాలేదు. పుష్ప సిక్వెల్ లో రష్మిక పాత్ర ఉండదని.. మరో కొత్త రోల్ ఉండనున్నట్లు వార్తలు కూడా తెగ వైరలయ్యాయి. ఈ క్రమంలోనే ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. పుష్ప 2 గురించి ఆసక్తికర విషయం బయటపెట్టింది. వచ్చే నెలలో తాను షూటింగ్‏లో జాయిన్ కాబోతున్నానని.. ఇప్పటికే సగం షూటింగ్ కంప్లీట్ అయిందున.. సెకండ్ పార్ట్ లో స్టోరీ ఎలా ఉండనుందో తెలుసుకోవడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉందని చెప్పుకొచ్చింది.

గతంలో పుష్ప చిత్రంలో రష్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇందులో బన్నీ, రష్మిక కాంబోలో వచ్చిన సామీ సామీ పాట యూట్యూబ్ ను షేక్ చేసింది. ఇప్పుడు పుష్ప 2 సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.