
సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ కన్నుమూత ఇండస్ట్రీని విషాదంలో ముంచేసింది. ‘కైకాల సత్యనారాయణ గారు నవరస భరితమైన నటనతో తెలుగు ప్రేక్షకులని అలరించిన గొప్ప నటుడు. చారిత్రాత్మక, సాంఘిక చలన చిత్రాల్లో తనదైన శైలితో మెప్పించిన నవరస నటనా సార్వభౌమడు కైకాల సత్యనారాయణ. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న కైకాల.. నిన్న (శుక్రవారం) తెల్లవారు జామున కన్నుముశారు. కైకాల మరణ వార్త తెలిసి సినీ ప్రముఖులంతా దిగ్బంతి వ్యక్తం చేశారు. నేడు మహాప్రస్థానంలో కైకాల అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు కుటుంబసభ్యులు. మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరికాసేపట్లో ఆయనకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే అంతిమ యాత్ర మొదలైంది.
దిగ్గజ నటుడ్ని కడసారి చూసేందుకు సినీ, రాజకీయ లోకం తరలివచ్చింది. నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ పార్ధివ దేహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సహా ప్రముఖులందరూ నివాళులు అర్పించారు.
తెలుగు నట శిఖరం కైకాల సత్యనారాయణ చివరి చూపు కోసం సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. ఆయన భౌతికకాయానికి చిరంజీవి, పవన్‌కల్యాణ్ నివాళి అర్పించారు. మహా నటుడి భౌతిక కాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు.