భారతీయ చిత్రపరిశ్రమలో సక్సెస్ ఫుల్ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్యయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయేంద్రప్రసాద్ ఇప్పటివరకు సినీ పరిశ్రమకు చేసిన కృషి చాలా ఎక్కువే. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల కథలను రాసింది ఆయనే. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్లో సూపర్ హిట్ చిత్రాలకు స్క్రిప్ట్ అందించారు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను రచించిన విజయేంద్ర ప్రసాద్.. పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తండ్రి అని మీకు తెలుసా. ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన అనేక చిత్రాలకు స్క్రిప్ట్ అందించింది ఆయన తండ్రి విజయేంద్రే ప్రసాదే.
విజయేంద్ర ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా కోవ్వూరులో ఆయన జన్మించారు. ఆయన తండ్రి కాంట్రాక్టర్. ఆరుగురు సోదరులు.. ఒక సోదరిలో. అందరి కంటే చిన్నవాడు విజయేంద్ర ప్రసాద్. వీరిది వ్యవసాయ ఆధారిత కుటుంబం. విజయేంద్ర సోదరుడు శివదత్తాకు కవిత్వం, కళలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. దర్శకుడిగా మారేందుకు సోదరులతో కలిసి చెన్నై వెళ్లారని.. ఆ తర్వాత చాలా సినిమాలకు స్క్రిప్ట్ రాసిన సక్సెస్ కాలేదు. తన సోదరుడితో కలిసి విజయేంద్ర ప్రసాద్ కూడా కథలు రాయడంలో ఆసక్తి పెంచుకున్నాడట. ఆయన రాసిన మొదటి చిత్రం బంగారు కుటుంబం. ఆ తర్వాత జానకి రాముడు, బొబ్బిలి సింహం, ఘరానా బుల్లొడు, సమరసింహరెడ్డి, సై, నా అల్లుడు వంటి సినిమాలకు స్క్రిప్ట్స్ అందించారు.
కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, హిందీ చిత్రాలకు స్క్రిప్ట్ అందించారు. 1996లో అర్ధాంగి అనే సినిమాకు దర్శకత్వం వహించారు. 2005లో ప్రభాస్ ప్రధాన పాత్రలో రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఛత్రపతి కూడా విజయేంద్ర ప్రసాద్ రాసిన స్టోరీనే. ఈ సినిమా బాక్సాఫీష్ ను షేక్ చేసింది. ఆ తర్వాత రామ్ చరణ్, రాజమౌళి కాంబోలో వచ్చిన మగధీర చిత్రాన్ని రాశారు. ఇవే కాకుండా తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో పరిచయం చేసిన బాహుబలి చిత్రాన్ని కూడా ఆయనే రాశారు. ఇక ఇటీవల సూపర్ హిట్ ఫిల్మ్ ఆర్ఆర్ఆర్ సినిమాకు స్ట్రిప్ట్ అందించారు.
2012లో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన రౌడీ రాథోర్ సినిమాకు మొదటిసారి స్క్రిప్ట్ అందించారు. ఆ తర్వాత 2015లో సల్మాన్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ బజరంగీ భాయిజాన్ సినిమాకు స్క్రిప్ట్ రాశారు. మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ (2019), తలైవి (2021) సినిమాలు కూడా ఆయన రాసినవే. కథలు రాయడమంటే విజయేంద్ర ప్రసాద్‌కు చాలా ఇష్టం. తన కొడుకు రాజమౌళితో సినిమా చేసేటప్పుడు చాలా ప్రొఫెషనల్‌గా ప్రవర్తిస్తాడని.. సెట్ లో వీరిద్దరి మధ్య కేవలం డైరెక్టర్, రచయితగానే వ్యవహరిస్తామని.. రాజమౌళి ఇన్ పుట్స్ పై చాలా శ్రద్ధ చూపిస్తానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్.