Tollywood: విజయవాడలో తెలుగు ఫిలిం ఛాంబర్‌లో 13జిల్లాల ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి సినిమా ధియేటర్‌ల యజమానులు హాజరయ్యారు. లాక్ డౌన్ ఆంక్షల సడలింపుతో 30 నుంచి ప్రదర్శనలు జరపాలని నిర్ణయించారు. అయితే యాభై శాతం ఆక్యూపెన్సీతోనే ప్రేక్షకులకు అనుమతివ్వాలని ఆదేశించింది ప్రభుత్వం. 50% ఆక్యూపెన్సీ ప్రదర్శల వల్ల నష్టం జరుగుతుందనే అభిప్రాయంను వ్యక్తం చేశారు ఎగ్జిబిటర్లు. అలాగే బి, సి సెంటర్లలో జీవో 35వల్ల ధియేటర్ల మనుగడ కష్టం అన్నారు. ఇక ఈ సమస్యల పై ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ప్రభుత్వ పెద్దలను కలిసేందుకుప్రణాళికనుసిద్ధం చేయనున్నారు.ఇక దీనిపై ఎగ్జిబిటర్లు ఓ ప్రకటన విడుదల చేయనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :