waltair veerayya : వీరయ్యను వదలని లీకు రాయుళ్లు.. అసలైన ఫైట్ నే బయటపట్టేశారే

ఎంత కష్టపడి తీసినా.. ఎంత పక్భందీగా దాచిపెట్టినా.. కలెక్షన్ల రికార్డులు బద్దుల కొడుదామనుకున్నా.. ఫలితం లేకుండా.. ఏదో రకంగా సినిమాను లాగి నెట్టింట పెట్టేయడం కామన్ అయిపోయింది సైబర్‌ నేరగాళ్లు.

waltair veerayya : వీరయ్యను వదలని లీకు రాయుళ్లు.. అసలైన ఫైట్ నే బయటపట్టేశారే
Waltair Veerayya

Updated on: Jan 14, 2023 | 8:15 AM

ఇయ్యాల రేపు సినిమాలు తీయడం కన్నా.. అవి లీకులు కాకుండా చూసుకోవడమే పెద్ద పనైపోయింది మేకర్స్‌కు. ఎంత కష్టపడి తీసినా.. ఎంత పక్భందీగా దాచిపెట్టినా.. కలెక్షన్ల రికార్డులు బద్దుల కొడుదామనుకున్నా.. ఫలితం లేకుండా.. ఏదో రకంగా సినిమాను లాగి నెట్టింట పెట్టేయడం కామన్ అయిపోయింది సైబర్‌ నేరగాళ్లు. వారితో పాటు.. సినిమా చూస్తున్న ఆడియెన్స్‌కు కూడా..! ఎస్ ! బుద్దిగా సినిమా చూస్తూ కూర్చోవడమో.. లేక సినిమాను ఎంజాయ్ చేస్తూ.. థియేటర్లో గెంతడమో చేయకుండా.. రీసెంట్ డేస్లో తమ ఫోన్లను పని చెబుతున్నారు సినిమా చూస్తున్నా వారు. సినిమాలోని కీ సీన్స్‌ను షూట్ చేసి.. నెట్టింట పోస్ట్ చేసి.. స్టేటస్‌లలో షేర్ చేసి.. స్పాయిలర్స్‌గా మారుతున్నారు. సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ నీరు గారేలా చేస్తున్నారు. ఇక తాజాగా రిలీజ్ అయిన చిరు వాల్తేరు వీరయ్య సినిమా విషయంలో కూడా ఇలాగే చేశారు కొంత మంది మూవీ చూసిన వారు.

తెలుగు టూ స్టేట్స్‌లో కంటే.. ఓవర్‌ సీస్‌లో కాస్త ముందుగా సినిమా రిలీజవుతుండడంతో… అక్కడ సినిమా చూసిన ఆడియెన్స్.. సినిమాలోని క్లిప్స్‌ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. అలా తాజాగా రిలీజైన కొద్ది సేసటికే.. చిరు ఇంట్రో ఫైట్‌ ఫుల్ సీన్‌ను సోషల్ మీడియాలో వదిలారు. అది వైరల్ అయ్యేలా చేశారు.

అయితే ఇటీవల అల్లు అర్జున్‌ పుష్ప సాంగ్‌ను.. సర్కారు వారి పాట మహేష్ టీజర్‌ను రిలీజ్‌కు కొన్ని నిమిషాల ముందే లీక్‌ చేసిన ఈ సినీ చోరులు… తాజాగా అక్షయ్‌ను కూడా పోటు పొడిచారు.