లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. నయన్ కొద్ది రోజులుగా సోషల్ మీడియా ఖాతాలలో ఎమోషనల్ పోస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఎప్పటికీ కన్నీళ్లతో ఇది లభించిందని చెబుతుందని.. నేను ఓడిపోయాను అంటూ నిత్యం హార్ట్ బ్రేకింగ్ పోస్టులు షేర్ చేస్తుంది. దీంతో ఆమె తన భర్తతో విడిపోతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని.. అందుకే నయన్ ఇలాంటి పోస్టులు పెడుతుందంటున్నారు. అటు విడిపోతున్నట్లుగా కోట్స్ షేర్ చేస్తూనే.. మరోవైపు ఫ్యామిలీ, భర్త, పిల్లలతో కలిసి సరదాగా ఉన్న ఫోటోలను షేర్ చేస్తుంది. దీంతో అసలు నయన్ జీవితంలో ఏం జరుగుతుంది. ? ఎందుకు ఇలాంటి పోస్టులు పెడుతుంది ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ముందుగా నయన్.. ఆమె ఏడుస్తున్నప్పటికీ ఆమె అర్థం చేసుకుంది అంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. దీంతో మొదటిసారి నయన్, విఘ్నేశ్ విడాకులు అంటూ రూమర్స్ తెరపైకి వచ్చాయి. వెంటనే విఘ్నేశ్ తన ఇన్ స్టాలో నయన్ కొత్త వ్యాపారం గురించి పోస్ట్ చేశారు. దీంతో విడాకుల వార్తలకు చెక్ పడింది. ఇక ఇక ఇటీవల నేను కోల్పోయాను అంటూ మరో పోస్ట్ చేసింది నయన్. దీంతో మళ్లీ వీరిద్దరి విడాకుల వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. నయన్ జీవితంలో అసలు ఏం జరుగుతుంది ?.. ఎందుకు ఇలా పోస్టులు పెడుతుంది ? అసలేం జరుగుతుందో మాకు చెప్పండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇక ఇప్పుడు నయన్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇదంతా కేవలం ఆమె పబ్లిసిటీ స్టంట్ అని అంటున్నారు. ఎందుకంటే.. రోజు ఎమోషనల్ కోట్స్ షేర్ చేస్తున్న నయన్.. ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోను పంచుకుంది. తన భర్త , పిల్లలతో కలిసి విమానంలో వెకేషన్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత మా అబ్బాయిలతో కలిసి వెళ్తున్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అందులో నయన్, విఘ్నేశ్ నవ్వుతూ కనిపించారు. దీంతో వారిద్దరి మధ్య ఎలాంటి సమస్య లేదని.. కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి పోస్టులు చేస్తుందని సీరియస్ అవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.