Thalapathy Vijay: సినిమాల్లోకి దళపతి విజయ్ కుమారుడి ఎంట్రీ.. ఆ విషయంలో ఫ్యాన్స్ డిజప్పాయింట్ మెంట్

|

Dec 01, 2024 | 1:23 PM

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న వారిలో దళపతి విజయ్ ఒకరు. అయితే కొన్ని నెలల క్రితమే రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు విజయ్. అంతేకాదు ఇంకొక్క సినిమా చేసిసినీ పరిశ్రమ నుంచి పూర్తిగా తప్పుకుంటానని క్లారిటీగా చెప్పేశాడు.

Thalapathy Vijay: సినిమాల్లోకి దళపతి విజయ్ కుమారుడి ఎంట్రీ.. ఆ విషయంలో ఫ్యాన్స్ డిజప్పాయింట్ మెంట్
Thalapathy Vijay Son Jason Sanjay
Follow us on

సినిమా హీరో-హీరోయిన్లు, నిర్మాతలు, వివిధ విభాగాల్లో పనిచేసే దర్శకులు తమ పిల్లలను హీరోలుగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో చాలా మంది సక్సెస్ అయ్యారు కూడా. అయితే దళపతి విజయ్ స్వతహాగా స్టార్ యాక్టర్ అయినప్పటికీ తన కొడుకుని హీరోగా కాకుండా డైరెక్టర్ గా లాంచ్ చేస్తున్నాడు. దళపతి విజయ్‌ తనయుడు జేసన్‌ సంజయ్‌ కథానాయకుడిగా సినీ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తారని ప్రచారం కూడ జరిగింది. అయితే విజయ్ తనయుడు సినిమా నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. అతని మొదటి సినిమా కూడా అధికారికంగా పట్టాలెక్కింది. అయితే విజయ్ తనయుడు హీరోగా ఎంట్రీ ఇవ్వకుండా దర్శకుడిగా వస్తుండటం విజయ్ అభిమానులను కాస్త నిరాశకు గురి చేసిందని తెలుస్తోంది.

విజయ్ తనయుడు జేసన్ సంజయ్ తొలి సినిమా ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్‌ని ఎంపిక చేశారు. లైకా ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హీస్ట్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్‌లో పురాతన వస్తువులు, డబ్బు కట్టలు కనిపిస్తున్నాయి. థ్రిల్లర్ కథాంశంతో సినిమా ఉంటుందని టీజర్ ను బట్టి తెలిసింది.

ఇవి కూడా చదవండి

రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ఇకపై సినిమాల్లో నటించనని ప్రకటించారు. ఇప్పుడు తన 69వ చిత్రంలో నటిస్తున్నాడు. అదే అతని చివరి చిత్రం. విజయ్ కొడుకు సినిమా పరిశ్రమలో తన తండ్రి స్థానాన్ని తీసుకుంటున్నాడని గతంలో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అతను అనూహయంగా దర్శకత్వం వైపు మొగ్గు చూపాడు. గతంలో, జేసన్ విజయ్ తన తండ్రి నటించిన కొన్ని చిత్రాలలో కనిపించాడు. పాటల్లో స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు.

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ తో మొదటి సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.