డార్లింగ్ ప్రభాస్(Prabhas)ప్రస్తుతం వరుస సినిమాలతో గ్యాప్ లేకుండా ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. ఆయన లైనప్ చేసిన సినిమాలన్నీ భారీ ప్రాజెక్టులే.. దాంతో ఆయన సినిమాల కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం డార్లింగ్ చేస్తున్న సినిమాల్లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న సలార్ ఒకటి ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అలాగే బాలీవుడ్ లో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. అలాగే మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం కూడా తెలిసిందే. పాన్ ఇండియన్ హీరో ప్రభాస్.. హీరోగా.. క్రేజీ డైరెక్టర్ మారుతీ ఓ సినిమా ప్లాన్ చేశారు. హర్రార్ కామెడీ నేపథ్యంలో.. ఇంతకు మునుపెప్పుడూ కనిపించని రోల్లో ప్రభాస్ ను మనకు ప్రజెంట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
కాని ఈ క్రమంలోనే.. ఈ డైరెక్టర్ తో సినిమా చేయొద్దంటూ.. నెట్టింట ప్రభాస్ ను రెక్వెస్ట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్ . ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్ అవసరమా.. అంటూ.. డైరెక్ట్ గానే కామెంట్ చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన మరికొంత మంది ప్రభాస్ ఫ్యాన్స్.. అలా కామెంట్ చేయకండని నెట్టింటే చెబుతున్నారు. మారుతీ సెన్సబుల్ డైరెక్టర్ అంటూ.. ప్రభాస్ కు తప్పకుండా హిట్టు పడేలా చేస్తారంటూ.. డైరెక్టర్ కు సపోర్ట్ చేస్తున్నారు. ఈ స్టేట్మెంట్ తో నెట్టింట వైరల్ అవుతున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..