తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన జక్కన్న.. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రంతో హాలీవుడ్ డైరెక్టర్లను సైతం మెప్పించాడు. ఈ సినిమాతో ప్రేక్షకులే కాకుండా సినీ విశ్లేషకులు సైతం ఫిదా అయ్యారు. రాజమౌళి స్క్రీన్ ప్లే పై ప్రశంసలు కురిపించారు. ఇటీవల అమెరికాలోని బియాండ్ ఫెస్ట్‌లో భాగంగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అక్కడ అమెరికన్స్ నుంచి ఈ మూవీకి విశేష స్పందన లభించింది. థియేటర్లో నాటు నాటు పాటకు స్టెప్పులేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. ఈ సినిమా తర్వాత జక్కన్న రూపొందించిన ఈగ చిత్రాన్ని కూడా బియాండ్ ఫెస్ట్‌లో ప్రదర్శించారు.
ఈ సినిమా చూస్తున్నంత సేపు చప్పుట్లు కొడుతూ.. అరుపులతో థియేటర్లలో రచ్చ చేశారు ప్రేక్షకులు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక ఈ వీడియోస్ నెట్టింట షేర్ చేస్తూ సంతోషంలో తేలిపోయారు చిత్రయూనిట్. నాని, సమంత, కిచ్చా సుదీప్ తమ సోషల్ మీడియా ఖాతాలలో ఈగ స్క్రీనింగ్ వీడియోస్ షేర్ చేశారు. ” ఒక దశాబ్దం తరువాత భూమిపై మరొక వైపు నుంచి అదే ప్రేమ అదే శక్తి అందుతుంది. 2012లో మా ఈగ కుటుంబంతోపాటు … మీ అందరితో మా ఫస్ట్ షో జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చారు నాని. ఇది అందంగా ఉంది అంటూ సామ్ ట్వీట్ చేసింది.
జక్కన్న తెరకెక్కించిన ఈగ చిత్రం 2012లో విడుదలైంది. ఇందులో నాని, సమంత జంటగా నటించగా.. ప్రతినాయకుడిగా కిచ్చా సుదీప్ నటించారు. ప్రపంచవ్యాప్తంగా రూ. 125 కోట్లకు పైగా వసూలు చేసింది. 2012లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో మఖీ పేరుతో హిందీలో విడుదలైంది.
A decade later
Other side of the globe
Same love same energyRelived our first day first show memories with our Eega family and all of you in 2012 ♥️https://t.co/Meo9AIarm3
Happy birthday MASTER @ssrajamouli ??
— Nani (@NameisNani) October 10, 2022
Very few films,, no matter how many times you watch,,no matter how old,,,it neva fails to impress all over again.
Thank u @ssrajamouli sir and team , and thanks to all you friends for this gift.
Thank you Los Angeles ❤️❤️https://t.co/goCNntSBLm— Kichcha Sudeepa (@KicchaSudeep) October 10, 2022
Beautiful ? https://t.co/qnb5mEvNWd
— Samantha (@Samanthaprabhu2) October 11, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.