సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో సినీతారలపై ఉండే అభిమానం గురించి తెలిసిందే. కొందరు హీరోలకు డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. ఇక తమ హీరో సినిమా వస్తే థియేటర్లలో దద్దరిల్లాల్సిందే. హీరోలపై ఫ్యాన్స్ కు ఉండే ప్రేమ, అభిమానం వేరెలెవల్. తమ హీరో సినిమాలకు భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి పాలాభిషేకం చేస్తుంటారు. అలాగే తమ హీరోను ఎవరైనా ఒక్కమాట అంటే కోపంతో ఊగిపోతుంటారు. ఇప్పటికే చాలాసార్లు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ క్రేజ్ మాత్రం వేరు. భాషతో సంబంధం లేకుండా డార్లింగ్ అంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. పాన్ ఇండియా స్టా్ర్ ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా డార్లింగ్ ఫాలోయింగ్ పెరిగింది. ముఖ్యంగా ఈ హీరోపై అభిమానులకు ఉండే ప్రేమ వేరేలెవల్. ఇప్పుడు డార్లింగ్ బాక్సాఫీస్ కింగ్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలతో వరల్డ్ వైడ్ రికార్డ్స్ కొల్లగొట్టిన ప్రభాస్.. ఇప్పుడు కల్కి 2898 ఏడీ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చూపించారు. ఈ చిత్రం రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీతో మరోసారి సెన్సెషన్ అయ్యారు డార్లింగ్.
ఇదిలా ఉంటే.. తాజాగా ప్రభాస్ కు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట వైరలవుతుంది. అందులో ఓ అభిమాని పిలుపు విని అవాక్కయ్యాడు ప్రభాస్. ఈ వీడియోలో డార్లింగ్ తన అభిమానులను కలిసేందుకు రాగా.. ఇంతలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆప్యాయంగా పలకరించాడు. “అన్నా భీమవరం వత్తావా” అంటూ పక్కా గోదారి యాసలో పిలిచాడు. అతడు పిలిచిన విధానం బాగుంది.. కానీ ఒక్కసారిగా గోదారి యాసలో ఉన్న ప్రభాస్ వెనక్కి తిరిగి భలే లుక్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్. ఏంటీ బ్రో.. అలా పిలిచేశావ్.. ఏదో ఆటోవాడిని వస్తావా అన్నట్లుగా పిలుస్తుననాడు.. ఇదేక్కడి ప్రేమరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ వీడియోలో ప్రభాస్ వెనకలా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కనిపిస్తుంది. అంటే ఈ వీడియో సాహో సినిమా సమయంలో జరిగినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కల్కి సినిమాతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టించిన డార్లింగ్.. ఇప్పుడు డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే కొద్దిరోజుల క్రితం డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో రానున్న ప్రాజెక్ట్ లాంఛ్ చేశారు. ఇందులో ఇన్ స్టా అమ్మాయి ఇమాన్వీ నటిస్తుంది.
ఆటో డ్రైవర్ లాగా పిలిచావు ఏంటి 😂 pic.twitter.com/FOk63xqBhR
— CEO Voice (@CeoVoice_) August 20, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.