AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Lakshmi: మంచు లక్ష్మి కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని.. ఆ తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

నటిగా, నిర్మాతగా, యాంకర్ గా.. ఇలా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మి. గతంలో ఎక్కువగా సినిమాల్లో నటించిన ఈ ట్యాలెంటెడ్ బ్యూటీ ఇప్పుడు కెమెరాలకు కాస్త దూరంగా ఉంది. అయితే ఈ మధ్యన తన సేవా కార్యక్రమాలతో తరచూ వార్తల్లో నిలుస్తుందామె.

Manchu Lakshmi: మంచు లక్ష్మి కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని.. ఆ తర్వాత ఏం జరిగిందంటే? వీడియో
Manchu Lakshmi
Basha Shek
|

Updated on: Mar 19, 2024 | 3:34 PM

Share

నటిగా, నిర్మాతగా, యాంకర్ గా.. ఇలా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మి. గతంలో ఎక్కువగా సినిమాల్లో నటించిన ఈ ట్యాలెంటెడ్ బ్యూటీ ఇప్పుడు కెమెరాలకు కాస్త దూరంగా ఉంది. అయితే ఈ మధ్యన తన సేవా కార్యక్రమాలతో తరచూ వార్తల్లో నిలుస్తుందామె. టీచ్ ఫర్ చేంజ్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటూ వాటి సంక్షేమానికి పాటు పడుతోంది మంచు లక్ష్మి. ఇక్కడి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా పలు సహాయ కార్యక్రమాలు చేపడుతోంది. ఇదిలా ఉంటే మంచు లక్ష్మి నటించిన తాజా చిత్రం ఆది పర్వం. లేడీ ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. మూవీ ఫంక్షన్ జరుగుతున్న సమయంలోనే తిరుపతికి చెందిన ఓ అభిమాని.. నేరుగా స్టేజీపైకి వచ్చాడు. అక్కడ మాట్లాడుతున్న మంచు లక్ష్మి కాళ్లపై పడిపోయాడు. దీంతో మంచు లక్ష్మితో సహా అందరూ ఆశ్చర్యపోయారు. అభిమాని హఠాత్తుగా అలా చేసే సరికి మంచు వారమ్మాయి దూరం దూరం జరిగింది. ఆ తర్వాత బాడీగార్డ్ వచ్చి అతడిని పైకి లేపి కిందకు తీసుకెళ్లారు. అయితే పైకి లేపిన తర్వాత కూడా పూర్తిగా కన్నీటి పర్యంతమయ్యాడు సదరు అభిమాని. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఆది పర్వం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పూర్తయిన తర్వాత సదరు అభిమానితో ప్రత్యేకంగా ఫొటో దిగింది మంచు లక్ష్మి. అలాగే అతని వివరాలు తెలుసుకుంది. ఇక సినిమా విషయానికి వస్తే.. సంజీవ్ మెగోటి తెరకెక్కిస్తోన్న ఆది పర్వం సినిమాను అన్వికా ఆర్ట్స్, ఏవన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 1974 నుంచి 1992 మధ్య జరిగే ఒక పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది.

ఇవి కూడా చదవండి

మంచు లక్ష్మి కాళ్ల మీద పడిన అభిమాని..

నెట్టింట వైరలవుతోన్న వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us