Poolachokka Naveen: పోలీసుల అదుపులో ఫేమస్ యూట్యూబర్ పూల చొక్కా నవీన్.. ఏం జరిగిందంటే?

ప్రముఖ తెలుగు యూట్యూబర్, రివ్యూయర్ పూల చొక్కా నవీన్ ను ఇబ్బందుల్లో పడ్డాడు. సినిమాలకు రివ్యూలు ఇస్తూ ఫేమస్ అయిన ఇతనిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ప్రముఖ నిర్మాత ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నవీన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Poolachokka Naveen: పోలీసుల అదుపులో ఫేమస్ యూట్యూబర్ పూల చొక్కా నవీన్.. ఏం జరిగిందంటే?
Poolachokka Naveen

Updated on: Jul 17, 2025 | 10:43 PM

ప్రముఖ తెలుగు యూట్యూబర్, రివ్యూయర్ పూల చొక్కా నవీన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే రిలీజైన వర్జిన్ బాయ్స్ సినిమా నిర్మాత రాజా దారపునేని నవీన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం వర్జిన్ బాయ్స్.  దయానంద్ తెరకెక్కించిన ఈ మూవీ జూలై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్లు రాబడుతోంది. .రాజ్ గురు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజా దారపునేని  ఈ సినిమాను నిర్మించారు. తాజాగా వర్జిన్ బాయ్స్ మూవీకి ప్రేక్షకుల ఆదరణ పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నిర్మాత దారపునేని రాజా మాట్లాడుతూ.. ఈ సినిమాపై కొంతమంది మీడియా ముసుగులో విషం జల్లుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు.

 

“మేము థియేటర్లలో చూసినప్పుడు ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతగా నచ్చిందో మాకు స్వయంగా అర్థమైంది. కానీ పూల చొక్కా నవీన్ లాంటి రివ్యూయర్లు మా సినిమా నుంచి డబ్బులు డిమాండ్ చేసి అవి ఇవ్వకపోయేప్పటికీ మాపై పగ పట్టి సాధిస్తున్నారు. మా సినిమాను ప్రేక్షకులలో నెగిటివ్ చేసేందుకు గాను వారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కావాలని మా సినిమా ఇమేజ్ డామేజ్ చేసే విధంగా నెగెటివ్ రివ్యూలు ఇస్తున్నారు. అతనితో పాటు మరికొందరు యూట్యూబర్లు  సినిమాల విడుదలకు ముందే సినిమాలపై నెగిటివ్గా రివ్యూలు ఇచ్చి ఆడియెన్స్ ను తప్పుదారి పట్టిస్తున్నారు. వారిపై ఇప్పటికే ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేశాం. లీగల్ గా కూడా వారిపై చర్యలు తీసుకుంటాం. అలాగే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాం’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు పూల చొక్కా నవీన్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో పూల చొక్కా నవీన్.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.