Bindu Ghosh: 300కు పైగా సినిమాలు.. వైద్యానికి డబ్బుల్లేక దీన స్థితిలో కన్ను మూసిన టాలీవుడ్ నటి

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగుతో పాటు పలు దక్షిణాది భాషల్లో నటించిన బిందు ఘోష్ (76) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో పాటు కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమె ఆదివారం (మార్చి 16)న తుది శ్వాస విడిచారు.

Bindu Ghosh: 300కు పైగా సినిమాలు.. వైద్యానికి డబ్బుల్లేక దీన స్థితిలో కన్ను మూసిన టాలీవుడ్ నటి
Actress Bindu Ghosh

Updated on: Mar 17, 2025 | 8:20 AM

తెలుగుతో పాటు పలు దక్షిణాది భాషా సినిమాల్లో నటించిన సీనియర్ నటీమణి బిందు ఘోష్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆమె దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇందుకు చికిత్స కూడా తీసుకుటున్నారు. అయితే ఆదివారం (మార్చి 16) పరిస్థితి విషమించడంతో బిందు ఘోష్ తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. నటి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. బిందు ఘోష్ 1982లో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఆమె నటించిన మొదటి సినిమా ‘కోళి కూవుడు’. ఇందులో ఆమె ప్రభు గణేషన్ తో కలిసి స్క్రీన్‌ను పంచుకున్నారు. దీని తర్వాత ఆమె కమల్ హాసన్, రజనీకాంత్, శివాజీ గణేషన్, ప్రభు గణేషన్, విజయకాంత్ తదితర స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించారు.

ఇక తెలుగు సినిమాల్లోనూ నటించారు బిందు ఘోష్. దొంగ కాపురం, పెళ్లి చేసి చూడు, కృష్ణ గారి అబ్బాయి, ప్రాణానికి ప్రాణం, చిత్రం భళారే విచిత్రం తదితర చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యారు. ఓవరాల్ గా తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారామె. కాగా గత కొద్దికాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న బిందు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రముఖులు ఆమె చికిత్సకు సహాయం చేశారు. ప్రస్తుతంచైన్నెలోని విరుగంబాక్కంలో నివశిస్తున్న బిందు ఘోష్‌ ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. కాగా బిందు ఘోష్‌ భౌతిక కాయానికి సోమవారం (మార్చి 17) అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె కుమార్తెలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ప్రముఖుల నివాళి..

118 నుంచి 38 కిలోలకు

కాగా గతంలో బాగా బొద్దుగా ఉన్న బిందు ఘోష్ అనారోగ్యంతో బాగా బక్కచిక్కిపోయారు. ఒకప్పుడు 118 కిలోలు ఉన్న ఆమె అనారోగ్యం కారణంగా చివరి రోజుల్లో 38 కిలోలకు తగ్గిపోయారు.  ఆహారం తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడిందని  ఆమె సన్నిహితులు చెప్పుకొచ్చారు.

చివరి రోజుల్లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి