వేణు స్వామి.. ఈ ప్రముఖ జ్యోతిష్యుడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన వర్షం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ పెద్ద మనిషి చాలా ఫెమస్. సెలబ్రెటీల జాతకాలు చెప్పి పాపులర్ అయ్యాడు వేణు స్వామి. సెలబ్రెటీల జాతకాలతో పాటు ఎవరు ఎప్పుడు చనిపోతారో కూడా చెప్పగలరు ఈయన. ముఖ్యంగా సెలబ్రెటీల విడాకుల గురించి కూడా ముందే చెప్తారు వేణు స్వామి. నాగ చైతన్య విడిపోతారు అని ముందే చెప్పారు వేణు స్వామి. ఆయన చెప్పినట్టుగానే సామ్, చైతన్య విడిపోయారు. దాంతో వేణు స్వామి పేరు మారుమ్రోగిపోయింది. ఇదిలా ఉంటే కొంతమంది ఆయనతో ప్రత్యేక పూజలు కూడా చేయించుకున్నారు.
క్రేజీ హీరోయిన్ నిధి అగర్వాల్, అషురెడ్డి లాంటి హీరోయిన్స్ వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఇదిలా ఉంటే వేణు స్వామికి ఇప్పుడు మాత్రమే కాదు ఎప్పటి నుంచో సినీ సెలబ్రెటీలతో సంబంధం ఉంది. చాలా మంది హీరోల సినిమాల ఓపినింగ్స్ కు వేణు స్వామీ పూజలు చేశారు.
ఇదిలా ఉంటే వేణు స్వామి సినిమాల్లో కూడా నటించారని మీకు తెలుసా..? అవును వేణు స్వామి సినిమాల్లోనూ కనిపించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలోనూ నటించారు వేణు స్వామి. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు సినిమాలో కనిపించారు వేణు స్వామి. ఒక పాటలో త్రిష అక్క పెళ్లి జరిపించే పురోహితుడిగా కనిపించారు. అలాగే జగపతి బాబు నటించిన ఓ సినిమాలో ఆలయ పూజారిగా కనిపించారు వేణు స్వామి. ఈ సీన్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. వేణు స్వామి కి సంబంధించిన సీన్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.