
Shalini : స్టార్ హీరో అజిత్(Ajith)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయనకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అజిత్ సినిమాలు ఇక్కడ కూడా రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇక అజిత్ సతీమణి షాలిని(Shalini) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పలు సినిమాల్లో ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. మెగాస్టార్ నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో షాలిని నటించింది. ఆతర్వాత మాధవన్ హీరోగా వచ్చిన సఖి సినిమాలో హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. అజిత్ ని పెళ్లాడిన తర్వాత ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా షాలిని పేరుతో నకిలీ ట్విటర్ అకౌంట్ ప్రత్యక్షం అయ్యింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు షాలిని పేరుతో నకిలీ అకౌంట్ ను కొందరు క్రియేట్ చేశారు. మిస్సెస్ షాలిని అజిత్‌కుమార్ పేరుతో క్రియేట్ చేసిన ఈ ఖాతాను అజిత్ కుమార్ కార్యాలయ సిబ్బంది గుర్తించి నెటిజన్లను అలెర్ట్ చేశారు. షాలినికి ఎలాంటి సోషల్ మీడియా ఖాతా లేదని హీరో అజిత్ కుమార్ వ్యక్తిగత పీఆర్వో స్పష్టం చేశారు. అజిత్ కుమార్ కూడా ఇటీవల తనకు ఎటువంటి సోషల్ మీడియా ఖాతాలు లేవని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు అజిత్ పీఆర్వో.
మరిన్ని ఇక్కడ చదవండి :