
ప్రస్తుతం ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతున్న ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ గురించి మీకు తెలుసా.. ? కేవలం మూడు పాత్రల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. 1 గంట 29 నిమిషాలు మిమ్మల్ని రెప్పవేయనివ్వదు. రోటిన్ స్టోరీగా స్టార్ట్ అయిన ఈ చిత్రం విరామం తర్వాత థ్రిల్లర్‌గా మారుతుంది. సినిమా చూసిన తర్వాత మీరు ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ మూడ్ లో ఉండిపోతారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సినిమా పేరు ‘ఇరుల్’. మలయాళ భాషలో నిర్మించిన ఈ సినిమా కథ కేవలం మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఇందులో షోబిన్ సాహిర్, ఫహద్ ఫాసిల్, దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. ‘ఇరుల్’ అనేది కేవలం ఒక రాత్రి కథ. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు కేవలం మూడు పాత్రలు మాత్రమే కనిపిస్తాయి.
‘ఇరుల్’ సినిమాలో..అలెక్స్ (షోబిన్ షాహిర్), అతని స్నేహితురాలు అర్చన ఒక ట్రిప్ వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. అలెక్స్ ఇద్దరూ తమ మొబైల్‌లను ఇంట్లోనే ఉంచాలని షరతు పెడతాడు. అందుకు అర్చన అంగీకరించి ఇద్దరూ కారులో స్టార్ట్ అవుతారు. ఇంతలో భారీ వర్షం పడటం ప్రారంభమవుతుంది.. అదే సమయంలో కారు అకస్మాత్తుగా ఆగిపోతుంది. దీంతో అలెక్స్ దిగి తనిఖీ చేస్తాడు కానీ కారుకు ఏమి జరిగిందో అతనికి అర్థం కాదు. వెంటనే అతను అర్చనను సమీపంలోని బంగ్లాకు తనతో పాటు వెళ్లి సహాయం అడగమని అడుగుతాడు. ఇద్దరూ బంగ్లా వద్దకు చేరుకుని తలుపు తట్టారు. కొంత సమయం తర్వాత గేటు తెరుచుకుని ఒక వ్యక్తి బయటకు రావడంతో అలెక్స్, అర్చన అతనిని సహాయం అడుగుతారు.
ఇక అప్పుడే అసలు కథ మొదలవుతుంది. కొంత సమయం తర్వాత సినిమా కథ మొత్తం మారిపోతుంది. ఆ తర్వాత అనుక్షణం ఉత్కంఠతో సాగుతుంది. దాదాపు 1 గంట 29 నిమిషాల నిడివి గల ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ఉత్కంఠతో నిండి ఉంటుంది. క్లైమాక్స్‌లో మీరు ఊహించని పెద్ద రహస్యం బయటపడుతుంది. అసలు విలన్ ఎవరో మీరు అస్సలు తెలుసుకోలేరు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..