Fahadh Faasil : హీరోగానే కాదు విలన్‌‌‌‌గానూ భయపెట్టనున్న మలయాళ విలక్షణ నటుడు..

| Edited By: Anil kumar poka

Jul 15, 2021 | 9:45 AM

మాలీవుడ్ లో విలక్షణ పత్రాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఫహాద్ ఫాజిల్. ప్రథకు ప్రాణం పోయడానికి తన సాయశక్తుల ప్రయత్నిస్తుంటాడు ఈ హీరో.

Fahadh Faasil : హీరోగానే కాదు విలన్‌‌‌‌గానూ భయపెట్టనున్న మలయాళ విలక్షణ నటుడు..
Fahad Fazil
Follow us on

Fahadh Faasil : మాలీవుడ్ లో విలక్షణ పత్రాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఫహాద్ ఫాజిల్. ప్రథకు ప్రాణం పోయడానికి తన సాయశక్తుల ప్రయత్నిస్తుంటాడు ఈ హీరో. అంతే కాదు నేషనల్ వైడ్ ఫేమస్  అయ్యాడు ఫహాద్ ఫాజిల్. అంతే కాదు ఇటీవల వరుసగా ఓటీటీ ల్లో సక్సెస్ సాధించి ఓటీటీ స్టార్ గా మారాడు. ‘రాజా రాణి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ నజ్రియా భర్తే ఫహద్. ఇప్పుడు తెలుగులో కూడా తన సత్తా చూపనున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు ఫహాద్ ఫాజిల్. ఆహా ఓటీటీలో వచ్చిన ‘ట్రాన్స్’ సినిమాతో ఫహాద్ ఫాజిల్ మనదగ్గర కూడా ఫెమస్ అయ్యారు. ఈ సినిమాలో ఆయన నటనకు అందరు ఫిదా అయ్యారు. ఇప్పటికే ‘సి యూ ‘సూన్’ ‘ఇరుల్’ ‘జోజి’ వంటి చిత్రాలను డైరెక్ట్ ఓటీటీ విధానంలో విడుదల చేసిన ఫహాద్.. ”మాలిక్” అనే మరో చిత్రాన్ని ఓటీటీ రిలీజ్ కు రెడీ చేశారు. ఈ చిత్రం జూలై 15 నుంచి ఈ అమెజాన్ ప్రైమ్ అందుబాటులోకి రానుంది.

హీరోగా సినిమాలు చేస్తూనే విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ అలరిస్తున్నారు ఫహాద్. పాత్ర నచ్చితే చాలు వెంటనే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేస్తారు ఫహాద్. ఇక పుష్ప సినిమాలో ఫహద్ విక్రమ్ అనే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ చిత్రంలో ఫహద్ మెయిన్ విలన్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో జరుపుకుంటుంది.అలాగే  కమల్ హాసన్ – లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందుతున్న ‘విక్రమ్’ చిత్రంలో విలన్ గా నటించడానికి  ఓకే చెప్పాడు ఈ విలక్షణ నటుడు. ఇలా హీరోగా విలన్ గా మెప్పిస్తూ దూసుకుపోతున్నాడు ఫహాద్ ఫాజిల్.

మరిన్ని ఇక్కడ చదవండి :

ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు జాతీయ స్థాయి గుర్తింపు పొందిన హీరోయిన్.. ఎవరో తెలుసా..

లడాఖ్ లో ఆమిర్ ఖాన్, కిరణ్ రావు ఫోక్ డ్యాన్స్ చూడాల్సిందే.. ఫ్యాన్స్ సంబరం