fahad fazil: “క్యారెక్టర్‌లో వేరియన్స్.. పర్ఫార్మెన్స్‌కి ప్లేస్” ఉంటే చాలు మలయాళీ వెర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ ని ఎవరూ ఆపలేరు. తన ఫర్ఫార్మెన్స్‌తో సినిమాని అమాంతం లాగేసుకుని ఓ మాస్టర్ పీస్ గా ఆ సినిమాను మారుస్తారు. పాషన్ సినిమాల్లోకి వచ్చిన ఫాజిల్ మలయాళ ఇండస్ట్రీలో మిస్టర్ ఫర్‌ఫెక్ట్ గా పేరుతెచ్చుకున్నారు. అయితే టాలీవుడ్‌లో కూడా అదే పేరు తెచ్చుకోడానికి.. ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని పాన్ ఇండియా మూవీ పుష్ఫతోనే ఇంప్లిమెంట్ కూడా చేయబోతున్నారు. ఇంతకీ ఏంటా మాస్టర్ ప్లాన్ అని మీరు కూడా అనుకుంటున్నారు కదూ.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ను ఢీకొట్టబోయే క్యారెక్టర్ చేస్తున్న ఫాజిల్.. ఆ క్యారెక్టర్ కోసం తెలుగు నేర్చుకోవాలని డెసీషన్ తీసుకున్నారట. సినిమాలోని తన క్యారెక్టర్‌ను పండించడానికి… తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావడానికి… తన పాత్రకు తగ్గట్టుగా రాయలసీమలోని చిత్తూరు యాస నేర్చుకుంటున్నారట. ఈ లాక్ డౌన్ టైంలో మరే పని చేయకుండా తెలుగుతో కుస్తీ పడుతున్నారట.. ఇప్పుడిదేవ విషయం ఇండస్ట్రీల వైరల్ గా మారింది.
ఇక “పుష్ప” సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారట. ఈ రెండు భాగాల బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటుందట. మొదటి భాగం షూటింగ్ దాదాపు పూర్తయిందని.. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మాస్ ఎంటర్ టైనర్ లో మాస్ ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉంటాయట. ఇక ఇప్పటికే విడుదల చేసిన “ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్” వీడియో ఇంటర్నెట్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి మరి!
మరిన్ని ఇక్కడ చదవండి :