
ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ ద్వారా చాలా మంది పాపులార్ అయ్యారు. ఈ కామెడీ షో చాలా మందికి లైఫ్ ఇచ్చింది. జబర్దస్త్ తర్వాత చాలా మందికి సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి. కొంతమంది నటులుగా మారితే మరికొంతమంది దర్శకులుగా మారారు. వేణు, ధన రాజ్ లాంటివారు దర్శకులుగా సినిమాలు చేస్తున్నారు. అలాగే హైపర్ ఆది, రాఘవ, గెటప్ శ్రీను ఇలా కొంతమంది కమెడియన్స్ గా చేస్తున్నారు. అలాగే సుడిగాలి సుధీర్, రష్మీ హీరో, హీరోయిన్ గా సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటున్నారు. అలాంటి వారిలో హరి ఒకడు.. ఎక్స్ ప్రెస్ హరి అంటారు ఇతన్ని.. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాడు హరి. జబర్దస్త్ లోనే కాదు.. పలు టీవీ షోల్లోనూ తన కామెడీతో పేక్షకులను అలరించాడు హరి.
ఇక జబర్దస్త్ షోలో నటీనటులు చాలా మంది ఎన్నో కష్టాలు అనుభవించారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆతర్వాత అవకాశాలు అందుకొని సక్సెస్ అయ్యారు. ఇప్పటికే పలు సందర్భాల్లో కొంతమంది తాము ఎదురుకున్న కష్టాలు గుర్తు చేసుకున్నారు. తాజాగా హరి కూడా తన కష్టాలను గుర్తు చేసుకున్నాడు. ఒకానొక సమయంలో తిండికోసం ఎంతో కష్టపడ్డాను అని తెలిపాడు హరి. తేజస్వి మదివాడ హోస్ట్ గా చేస్తున్న కాకమ్మ కబుర్లు అనే షోకు హరి గెస్ట్ గా హాజరయ్యాడు.
ఈ షోకు సంబంధించిన ప్రమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో హరి కష్టలను చూపించారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎన్నో కష్టాలు పడ్డాను. మా స్కూల్ లో తిండి కోసం ఎంతో కష్టపడేవాళ్ళం.. మా స్కూల్ లో 250మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళం.. తిండి కోసం పోటీపడేవాళ్ళం.. వంటినిండా దెబ్బలు తగిలేవి.. చేతులకు దెబ్బలు తగిలి రక్తం .. కారుతూ తినే ప్లేట్ లో పడేది.. మిగిలిపోయిన ఇడ్లిలా కోసం పరిగెత్తుకుంటూ వెళ్లే వాడిని.. ఆ టైం లో కింద పది మోకాళ్ళు దెబ్బతినేవి.. పరిగెత్తుకుంటూ వెళ్లి లైన్ లో నిలబడితే ఒక ఇడ్లి దొరికేది. మధ్యాహ్నం లంచ్ సమయంలో నాకు ఎవరైనా ఓక్ రూ. 10 ఇస్తే ఒక్క చెపాతి కొనుక్కొని తిందాం అనుకునేవాడిని.. అంటూ ఎమోషనల్ అయ్యాడు. అతని మాటలు విని తేజస్వి కూడా ఎమోష్నలైంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.