‘బాహుబలి’ సినిమాకు వీరాభిమాని ఈ తైవాన్ మంత్రి
'బాహుబలి' సిరీస్‌తో దర్శక ధీరుడు రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చూపించారు. ఈ సినిమాకి ఎన్నో రికార్డులు, రివార్డులు వరించాయి.
‘బాహుబలి’ సిరీస్‌తో దర్శక ధీరుడు రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చూపించారు. ఈ సినిమాకి ఎన్నో రికార్డులు, రివార్డులు వరించాయి. ఈ సినిమాలోని నటీనటులకు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్ఠలు వచ్చాయి. భారతీయ భాషల్లోనే కాకుండా విదేశీ భాషల్లో కూడా విడుదలై కలెక్షన్ల సునామి సృష్టించింది ‘బాహుబలి’. తెలుగు ప్రజలు ఏ దేశంలో అడుగుపెట్టినా కాలర్ ఎగరేసి ‘బాహుబలి’ సినిమా మాదే అని కాలర్ ఎగరేసి చెప్పుకుంటున్నారు. కాగా ఈ చిత్రానికి తైవాన్ (రిపబ్లిక్ ఆఫ్ చైనా) విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జోసెఫ్ వూ పెద్ద ఫ్యాన్ అయిపోయారు.
ఓ ఛానల్ డిస్కషన్ లో జోసెఫ్ వూ మాట్లాడుతూ.. బాహుబలి తనకు ఎంతో ఇష్టమైన చిత్రమని చెప్పారు. ‘టీవీలో వచ్చిన ప్రతీసారి నేను టీవీలో ‘బాహుబలి’ సినిమా చూస్తుంటాను. ఆ సినిమా చూసేటపుడు ఛానల్ మార్చవద్దని నా భార్య చెప్తా. ఎందుకంటే నాకు బాహుబలి సినిమా ఎన్నిసార్లు చూసినా గొప్పగానే అనిపిస్తుంది. నేను ఇప్పటికే లెక్కపెట్టలేనన్ని సార్లు బాహుబలి చిత్రాన్ని వీక్షించారు. ఇండియన్ సినిమా చూడటం చాలా సరదాగా ఉంటుంది’ అని జోసెఫ్ వూ పేర్కొన్నారు. అంతేకాదు ‘దంగల్’, ‘హిందీ మీడియం’ చిత్రాలంటే కూడా తనకు ఇష్టమని చెప్పారు.
#StraightTalk | “Every time I see ‘Baahubali’ movie, I tell my wife not to turn the channel, because I want to finish watching it again”: Taiwan’s Foreign Minister #JosephWu talks about his love for Indian movies, lists ‘Hindi Medium’ and ‘Dangal’ as his favourites.@palkisu pic.twitter.com/f32af2YuOD
— WION (@WIONews) October 21, 2020
Also Read :