లైగర్… డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రాణం పెట్టి.. మూడేళ్లపాటు కష్టపడి.. ఒక యజ్ఞంలా తీసిన పవర్‌ఫుల్ యాక్షన్ మూవీ.
కష్టం ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టు.. ఎంత స్పీడ్‌గా వచ్చిందో అంతే స్పీడ్‌గా వెళ్లిపోయింది.. నిర్మాతలకు నిలువెత్తు నిరాశే మిగిలింది ఈ సినిమాతో. సినిమా రిలీజ్‌కి ముందు పడ్డ కష్టాలతోనే కునారిల్లిపోయిన పూరి.. రిలీజ్ తర్వాత అంతకుమించిన కష్టాల్ని ఫేస్ చేశారు.. చేస్తున్నారు. దర్శకుడిగా ఫెయిల్యూర్‌ని ఎలాగోలా జీర్ణించుకున్నారు. బౌన్స్ బ్యాక్ అవుతానన్న కాన్ఫిడెన్స్ ఆయన్ను ముందుకే నడిపిస్తోంది. కానీ.. నిర్మాతగా మాత్రం ఆయనకు సినిమా కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. బొమ్మ తిరగబడి.. కమర్షియల్‌గా నెగిటివ్ రిజల్ట్ రావడంతో రాబడి ఘోరంగా తగ్గి.. నిర్మాతలకు బయ్యర్లనుంచి సెగ మొదలైంది. రీఫండ్ ఇస్తానని మాటిచ్చినా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు… నాతో పెట్టుకుంటే మసైపోతారు అంటూ ఇటీవలే బర్‌స్ట్ అయ్యారు పూరి.
బయ్యర్ల గొడవ అలా జరుగుతుండగానే.. లైగర్ మీద దర్యాప్తు సంస్థల కన్ను పడింది. లైగర్ మూవీ పెట్టుబడుల్లో హవాలా కోణం ఉందన్న సందేహంతో ఎంట్రీ ఇచ్చింది ఈడీ. ఈ సినిమాకు విదేశాల నుంచి పది కోట్లు పెట్టుబడులొచ్చాయన్నది కంప్లయింట్. డబ్బు దుబాయ్‌కి పంపి, అక్కడ్నుంచి సినిమాలో ఇన్వెస్ట్ చేశారన్నది అభియోగం. టోటల్‌గా 100 బినామీ అకౌంట్ల నుంచి మనీ ట్రాన్స్‌ఫర్ అయిందని, ఈ ఎపిసోడ్‌లో పొలిటికల్ లీడర్ల చేతివాటం కూడా లేకపోలేదని అనుమానిస్తున్నారు. మొదట్లో డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ప్రొడ్యూసర్ ఛార్మి… ఆ తర్వాత హీరో విజయ్ దేవరకొండ…! ఈడీ ఎదుట ఎటెండయ్యారు. 12గంటలపాటు విజయ్‌ని ప్రశ్నించి లైగర్ మూవీ ఆర్ధిక లావాదేవీలపై లోతుగా ఆరా తీశారు ఈడీ అధికారులు. వాళ్ల డ్యూటీ వాళ్లు చేశారు… నా డ్యూటీ నేను చేశా… ఇదొక ఎక్స్‌పీరియన్స్… అనేది ఇంటరాగేషన్ తర్వాత రౌడీ హీరో దగ్గరున్న క్లారిటీ.
విజయ్ దేవరకొండ గతంలో నటించిన సినిమాల కంటే లైగర్ మూవీకి తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడంపై కూడా ఆరా తీసింది ఈడీ. డైరెక్టర్ పూరీపై తనకుండే నమ్మకం వల్లే ఫండింగ్ విషయంలో రౌడీ హీరో ఫ్లెక్సిబుల్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా ఇంటరాగేషన్ సినిమాను కంటిన్యూ చేస్తూనే ఉంది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. మరి… నెక్ట్స్ ఏంటి? లైగర్ మూవీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న మెయిన్ మాస్టర్ మైండ్ ఎవరు..?
సినిమాకైన పెట్టుబడి, ఆర్టిస్టులకిచ్చిన రెమ్యునరేషన్లు, మిగతా ప్రొడక్షన్ ఖర్చులు, రిలీజ్ తర్వాత సినిమాకొచ్చిన వసూళ్లు.. ఇలా ఏ టూ జెడ్.. అన్నింటిపై కూపీ లాగుతున్నారు. లైగర్‌లో నటించిన ఒకప్పటి హెవీ వెయిట్ బాక్సర్ మైక్‌టైసన్‌కు సైతం ఈడీ నోటీసులు జారీ చేసే ఛాన్సుందట. ఇదే జరిగితే… లైగర్ సినిమా మీద విదేశాల్లో కూడా నెగిటివ్ ఫీల్ రావొచ్చు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత… తన దశ తిరిగిందన్న ఉత్సాహంతో పూరి చేసిన బిగ్ మూవీ లైగర్. విజయ్ దేవరకొండను యాక్షన్ హీరోగా ట్రాన్స్‌ఫామ్ చేస్తూ తీసిన లైగర్… పాన్ ఇండియా కాదు… పాన్ వరల్డ్ మూవీగా ప్రమోటౌంది. దానికి తగ్గట్టే మైక్ టైసన్ లాంటి స్టార్‌కాస్టింగ్… నార్త్ డిస్ట్రిబ్యూషన్‌లో కరణ్‌జోహార్ ఇచ్చిన హెల్పింగ్ హ్యాండ్… పూరీకి మంచి బూస్ట్ అయింది. కానీ.. సినిమా రిలీజయ్యాకే కథ అడ్డం తిరిగింది. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి.. పూరీకి మాత్రమే కాదు.. టోటల్ టాలీవుడ్‌కే ఒక చేదు జ్ఞాపకంగా మిగిలింది లైగర్ మూవీ. ఇప్పుడు జరుగుతున్న ఈడీ విచారణలో షాకింగ్ డీటెయిల్స్ ఏమైనా బైటికొస్తే… సినిమా ప్రొడ్యూసర్ల ఫ్యూచర్ ఏంటి… అనేది ఫిలిమ్ సర్కిల్స్‌ని హీటెక్కిస్తున్న బిగ్గెస్ట్ డౌట్.