Easwari Rao: ఆ సినిమా చూసి శేఖర్ కమ్ముల కాల్ చేసి సినిమా ఆఫర్ చేశారు.. ఈశ్వరీరావు ఆసక్తికర కామెంట్స్

|

Sep 23, 2021 | 8:57 AM

తెలుగు, తమిళ్ సినిమాల్లో నటనతో ఆకట్టుకునే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లలో ఈశ్వరీరావుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఎలాంటి పాత్రలోకి అయినా ఇట్టే ఒదిగిపోతారు ఈశ్వరీరావు.

Easwari Rao: ఆ సినిమా చూసి శేఖర్ కమ్ముల కాల్ చేసి సినిమా ఆఫర్ చేశారు.. ఈశ్వరీరావు  ఆసక్తికర కామెంట్స్
Easwari Rao
Follow us on

Easwari Rao: తెలుగు, తమిళ్ సినిమాల్లో నటనతో ఆకట్టుకునే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లలో ఈశ్వరీరావుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఎలాంటి పాత్రలోకి అయినా ఇట్టే ఒదిగిపోతారు ఈశ్వరీరావు. ఆమె సహజ నటనతో సినిమాకు కీలకంగా మారుతుంటారు. ఇప్పటికే పలు సినిమాల్లో మెప్పించిన ఆమె ఇప్పుడు లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లవ్ స్టోరీ సినిమాలో కీలక పాత్రలో నటించారు ఈశ్వరీరావు. నాగచైతన్య -సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో ఈశ్వరీరావు చైతన్య తల్లిగా నటించారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. అందుకు తగ్గట్టుగా తెలంగాణ మహిళగా ఈశ్వరీరావు అద్భుతంగా నటించారని తెలుస్తుంది. ఈ నెల 24న లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తాజాగా చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు తెలిపారు. లవ్ స్టోరీ సినిమాలో చైతన్య తల్లిగా ఈశ్వరి రావు చాలా బాగా చేశారు. తనకు ఫోన్ లో క్యారెక్టర్ గురించి చెప్పి నెక్స్ట్ డే ఆడిషన్స్ కోసం పిలిస్తే.. 80 రూపాయల చీర కట్టుకొని అదే క్యారెక్టర్‌లో వచ్చింది ఆమె . అంత డెడికేటెడ్ ఆర్టిస్ట్. అంటూ ప్రశంసలు కురిపించారు. బాపుగారి దర్శకత్వంలో వచ్చిన రాంబంటు అనే సినిమాలో హీరోయిన్‌గా చేశారు ఈశ్వరీ రావు. ఆసినిమా తర్వాత ఆమెను తెలుగు ప్రజలు బాపు బొమ్మగా గుర్తుపెట్టుకున్నారు. ఆ తర్వాత రజినీకాంత్ నటించిన కాలా సినిమాలో నటించి మెప్పించారు ఈశ్వరీరావు. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అరవింద సమెత, అలవైకుంఠపురంలో కీలక పాత్రలో నటించారు ఈశ్వరీరావు. కాలా సినిమా చూసి శేఖర్ కమ్ముల కాల్ చేసి సినిమా ఆఫర్ చేశారని తెలిపారు ఈశ్వరీరావు. వర్క్‌షాప్ కోసం వెళ్ళేటప్పుడు తెలంగాణ ఆడపడుచులనే తయారై వెళ్ళాను.. దాంతో అందరు షాక్ అయ్యారు.. అంటూ చెప్పుకొచ్చారు ఈశ్వరీరావు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss Telugu 5: ఇప్పటికి కళ్లుతెరిచిన షణ్ముఖ్.. సిరిని అంతమాట అనేశాడేంటి.. !!

NTR: కొత్త కారు కోసం ఫ్యాన్సీ నంబర్‌ దక్కించుకున్న ఎన్టీఆర్‌.. 9999 నంబర్‌కు ఎంత పెట్టారో తెలిస్తే షాక్..

Regina Cassandra: బంపర్ ఆఫర్ కొట్టేసిన రెజీనా.. ఆ క్రేజీ వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గా ఈ హాట్ బ్యూటీ..