Dulquer Salmaan: డైలమాలో దుల్కర్ సల్మాన్- వైజంతి మూవీస్ సినిమా.. ఉన్నట్టా..? లేనట్టా..?

|

May 24, 2021 | 7:42 PM

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. మణిరత్నం తెరకెక్కించిన ఓకే బంగారం సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Dulquer Salmaan: డైలమాలో దుల్కర్ సల్మాన్- వైజంతి మూవీస్ సినిమా.. ఉన్నట్టా..? లేనట్టా..?
Follow us on

Dulquer Salmaan: మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. మణిరత్నం తెరకెక్కించిన ఓకే బంగారం సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓకే బంగారం సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని చేసుకుంది. ఆ తర్వాత దుల్కర్ నటించిన కొన్ని సినిమాలు తెలుగులోకి కూడా డబ్ అయ్యాయి. ఇక నాగ్ అశ్విన్ నటించిన మహానటి సినిమాలో దుల్కర్ నటన ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించింది. జెమని గణేష్ పాత్రలో అద్భుతంగా నటించారు దుల్కర్ సల్మాన్. ఇటీవల విడుదలైన `కనులు కనులను దోచాయటే` సినిమా కూడా మంచి హిట్ అయ్యింది. మహానటి సినిమా తర్వాత వైజయంతి బ్యానర్ లోనే దుల్కర్ తో మహానటి నిర్మాతలు వేరొక సినిమా ప్లాన్ చేశారు. అందాల రాక్షసి ఫేం హనురాఘవపూడి దర్శకత్వం ఉండబోతుందని ఆమధ్య వార్తలు వచ్చాయి.

దాంతో దుల్కర్ సల్మాన్ తెలుగులో డైరెక్ట్ సినిమా చేయబోతున్నాడని ఆమధ్య వార్తలు తెగ హడావిడి చేశాయి. హనురాఘవాపుడి కూడా దుల్కర్ కోసం ఓ ఇంట్రస్టింగ్ స్ట్రోరీని కూడా రెడీ చేసారని అన్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా గురించి ఎక్కడ చడీచప్పుడు లేదు. అసలు ఈ సినిమా ఎక్కడివరకు వచ్చింది. అసలు మొదలైందా.. అసలు అవుతుందా..? అన్నది ఎవ్వరికి తెలియడం లేదు. నాగ్ అశ్విన్ ప్రభాస్ తో సినిమా ప్రారంభించడంతో దుల్కర్ సినిమా సైడ్ అయిపోయిందనే టాక్ మరోవైపు వినిపిస్తోంది. అయితే అది ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Most Eligible Bachelor: అఖిల్ కొత్త సినిమా ఓటీటీలో విడుద‌ల కానుందా.? క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్‌..

Sameera Reddy: ఇంత నిరాశ లో నేను ఎంత సమయం గడిపానో ఇప్పటికీ నాకు తెలియదంటున్న హీరోయిన్..

Shahrukh Khan: మ‌రో కొత్త అవతార‌మెత్తనున్న బాలీవుడ్ బ‌ద్‌షా..! ఓటీటీని ఒడిసిప‌ట్టుకుంట‌న్న షారుఖ్‌..

Priyanka Arul Mohan: అక్కినేని యంగ్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన నాని హీరోయిన్.. ఏ సినిమాలో అంటే..