Lucky Baskhar: అలరిస్తున్న దుల్కర్ సల్మాన్ న్యూ మూవీ సాంగ్.. లక్కీ భాస్కర్ టైటిల్ ట్రాక్

|

Jul 29, 2024 | 2:48 PM

తన నటనతో టాలీవుడ్ లో మంచి గుర్తింపుతో పాటు భారీగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. దుల్కర్ సల్మాన్ ఒకే బంగారం సినిమాతో టాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించారు. ఆతర్వాత మహానటి సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. వీటితో పాటు రీసెంట్ గా వచ్చిన సీతారామం సినిమా దుల్కర్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Lucky Baskhar: అలరిస్తున్న దుల్కర్ సల్మాన్ న్యూ మూవీ సాంగ్.. లక్కీ భాస్కర్ టైటిల్ ట్రాక్
Lucky Baskhar
Follow us on

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. తన నటనతో టాలీవుడ్ లో మంచి గుర్తింపుతో పాటు భారీగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. దుల్కర్ సల్మాన్ ఒకే బంగారం సినిమాతో టాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించారు. ఆతర్వాత మహానటి సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. వీటితో పాటు రీసెంట్ గా వచ్చిన సీతారామం సినిమా దుల్కర్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సీతారామం సినిమాతో నేరుగా తెలుగులో సినిమా చేసి హిట్ అందుకున్నాడు ఈ స్టార్ హీరో.

ఇది కూడా చదవండి :  స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు.. అలనాటి అందాల తార గౌతమి కూతుర్ని చూశారా.?

ఇక ఇప్పుడు మరో తెలుగు సినిమా చేస్తున్నాడు దుల్కర్. లక్కీ భాస్కర్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా రానుంది. తాజాగా దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా, చిత్రబృందం ‘లక్కీ భాస్కర్’ టైటిల్ ట్రాక్‌ను విడుదల చేసింది. నిన్న (ఆదివారం) దుల్కర్ సల్మాన్ పుట్టిన రోజు. సోషల్ మీడియా వేదికగా దుల్కర్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు అభిమానులు, సినీ సెలబ్రెటీలు. అలాగే లక్కీ భాస్కర్ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ కూడా ఇచ్చారు.

ఇది కూడా చదవండి :Raviteja : ఒరేయ్ ఆజామో.. మన మాస్ రాజా కూతురు మెంటలెక్కించిందిగా..!!

ధనుష్ నటించిన ‘సార్’ చిత్రానికి దర్శకత్వం వహించి సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరు. ఇప్పుడు దుల్కర్‌ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్‌’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ పాన్-ఇండియన్ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌కు జోడీగా లేటెస్ట్ సెన్సేషన్ మీనాక్షి చౌదరి నటిస్తుంది. జివి ప్రకాష్ దీనికి సంగీతం సమకూరుస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చిత్రబృందం ఒకదాని తర్వాత ఒకటి అప్‌డేట్‌లు ఇస్తూనే ఉంది. ‘లక్కీ భాస్కర్’ సెప్టెంబర్ 27, 2024న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి