Kurup Teaser : మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా దుల్కర్ సల్మాన్.. ఆకట్టుకుంటున్న కురుప్ టీజర్

|

Mar 27, 2021 | 6:34 AM

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'ఓకే బంగారం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు దుల్కర్

Kurup Teaser : మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా దుల్కర్ సల్మాన్.. ఆకట్టుకుంటున్న కురుప్ టీజర్
Kurup Movie
Follow us on

Kurup movie Teaser : మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఓకే బంగారం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు దుల్కర్. ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆతర్వాత దుల్కర్ నటించిన మరికొన్ని సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి.

ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహా నటి సినిమాలో జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తాజాగా దుల్కర్ సల్మాన్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. ”కురుప్” అనే పాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడు దుల్కర్ . శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దుల్కర్ సల్మాన్ సమర్పణలో డ్యూల్ వే ఫెరర్ ఫిలిమ్స్ మరియు ఎమ్ స్టార్ ఎంటెర్టైమెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు దుల్కర్. ఇప్పటికే విడుడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమానుంచి టీజర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ’36 సంవత్సరాలు.. మూడు వందలకు పైగా టిఫాప్స్.. వెయ్యికి పైగా ప్రయాణాలు.. ఇదంతా ఒకరి కోసం..’ డైలాగ్ ఆకట్టుకుంది. సుకుమార కురుప్ అనే క్రిమినల్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ”కురుప్” సినిమా విడుదల  చేయనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

యంగ్ టైగర్‏ కోసం విలన్‏గా స్టార్ కమెడియన్.. మరోసారి ప్రతినాయకుడిగా అలరించనున్న సునీల్ !!

నవతరానికి యుద్ధ కళలు… సాహస క్రీడల్లో నైపుణ్యాలు అవసరం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్..

AR Rehaman: యాంకర్ పై సంచలన కామెంట్లు చేసిన మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్..