Liger Movie: డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమా లైగర్ . ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. లైగర్ సినిమాతో విజయ్ అటు బాలీవుడ్ కు అనన్య టాలీవుడ్ కు ఒకే సారి పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమానుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అభిమానులతో ఈ సినిమా కోసం మరో స్టార్ హీరో కూడా ఎదురుచూస్తున్నట.. ఆ హీరో ఎవరో కాదు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. ‘ఓకే బంగారం’ .. ‘మహానటి’ సినిమాల ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు.
నవంబర్ 12న దుల్కర్ నటించిన కురుప్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దుల్కర్ సినిమాతోపాటు ఆనంద్ దేవరకొండ నటించిన పుష్పక విమానం సినిమా కూడా విడుదలైంది. ‘పుష్పక విమానం’ టీమ్ కి సోషల్ మీడియా ద్వారా దుల్కర్ విషెస్ చెప్పాడు. ఆయన ట్వీట్ కి విజయ్ దేవరకొండ స్పందిస్తూ, దుల్కర్ ను ఒక సోదరుడిగా భావిస్తున్నట్టు చెప్పాడు. తాను ‘లైగర్’ షూటింగులో ఉన్నట్టుగా విజయ్ చెబితే, ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నానని దుల్కర్ అన్నాడు. ఇక కురుప్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొదటి రోజునుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :