తెలుగులో ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది.. కానీ వ్యభిచార కేసులో చిక్కుకొని కెరీర్ నాశనం చేసుకుంది

|

Aug 11, 2024 | 10:51 AM

వీరితో పాటు అనుకోని కారణాల వల్ల కెరీర్ నాశనం చేసుకున్న ముద్దుగుమ్మలు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది హీరోయిన్స్ కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో అనుకోని పొరపాట్లు చేసి ఇండస్ట్రీకి దూరం అయ్యారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. ఆమె చాలా ఫెమస్ హీరోయిన్. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి.. ఆతర్వాత హీరోయిన్ గా మారి సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది.

తెలుగులో ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది.. కానీ వ్యభిచార కేసులో చిక్కుకొని కెరీర్ నాశనం చేసుకుంది
Actress
Follow us on

చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. కొంతమంది పోటీ తట్టుకోలేక ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయారు. ఇంకొంతమంది పెళ్లిళ్లు చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పిన వారు కూడా ఉన్నారు. వీరితో పాటు అనుకోని కారణాల వల్ల కెరీర్ నాశనం చేసుకున్న ముద్దుగుమ్మలు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది హీరోయిన్స్ కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో అనుకోని పొరపాట్లు చేసి ఇండస్ట్రీకి దూరం అయ్యారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. ఆమె చాలా ఫెమస్ హీరోయిన్. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి.. ఆతర్వాత హీరోయిన్ గా మారి సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఊహించని విధంగా వ్యభిచార కేసులో అరెస్ట్ అయ్యి కెరీర్ నాశనం చేసుకుంది.

పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తిపట్టరా..? ఆమె చాలా ఫెమస్ . ఆమె పేరు శ్వేతా బసు ప్రసాద్. చైల్డ్ ఆర్టిస్ట్ గా హిందీలో కెరీర్ మొదలు పెట్టిన ఈ అమ్మడు. ఆతర్వాత హీరోయిన్ గా మారింది. 2002లో మక్డీ సినిమాతో బాలనటిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్వేతా బసు ప్రసాద్. అలాగే కహానీ ఘర్ ఘర్ కీ అనే టీవీ షో  మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ చిన్నది. ఇక తెలుగులో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్తబంగారు లోకం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

తెలుగులో తొలి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాతో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ఆతర్వాత ఈ అమ్మడు వరుస ఆఫర్స్ అందుకుంది. తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసిన శ్వేతా బసు. ఆతర్వాత ఓ తప్పు చేసి కెరీర్ ను నాశనం చేసుకుంది. హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ లో పట్టుబడింది. 2014లో హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ లో పట్టుబడింది శ్వేతా బసు. ఆమెను అప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. శ్వేతను కొన్ని నెలల పాటు రెస్క్యూ హోమ్ కు తరలించారు. ఆతర్వాత బయటకు వచ్చిన ఆమె సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఆమె అసలు ఏం జరిగిందో తెలిపింది. ఓ ఈవెంట్ కోసం హైదరాబాద్ వెళ్లినట్లు తెలిపింది. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపింది. ఇక ఇప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.  ఇటీవలే బాలీవుడ్ లో ఓ సినిమా చేసింది. ఆ సినిమాలో హాట్ గా కనిపించింది. ఇక సోషల్ మీడియాలోనూ శ్వేతా బసు చాలా యాక్టివ్ గా ఉంటుంది.

శ్వేతా బసు ఇన్ స్టా గ్రామ లేటెస్ట్ పోస్ట్..

శ్వేతా బసు ఇన్ స్టా గ్రామ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..