Childhood Photo: తండ్రి లాలనను ఎంజాయ్ చేస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఈ అమ్మడుకు కుర్రాళ్లలో యమా క్రేజ్ ఉంది గురూ..

పైన కనిపిస్తున్న చిన్నారి కూడా అలా ఓవర్ నైట్ లోనే క్రేజ్ సొంతం చేసుకుంది. ఇంతకు ఆ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..? ఈ అమ్మడి అందానికి పడిపోని కుర్రాడు ఉండడు.

Childhood Photo: తండ్రి లాలనను ఎంజాయ్ చేస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఈ అమ్మడుకు కుర్రాళ్లలో యమా క్రేజ్ ఉంది గురూ..
Tollywood
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 27, 2022 | 4:28 PM

ఇటీవల చాలా మంది ముద్దుగుమ్మలు ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. ఒక్క సినిమా క్లిక్ అయితే చాలు విపరీతమైన క్రేజ్ వచ్చేస్తోంది. పైన కనిపిస్తున్న చిన్నారి కూడా అలా ఓవర్ నైట్ లోనే క్రేజ్ సొంతం చేసుకుంది. ఇంతకు ఆ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..? ఈ అమ్మడి అందానికి పడిపోని కుర్రాడు ఉండడు. అందం అమాయకత్వం కలగలిపిన ఈ చిన్నది ఇప్పుడు యువతకు ఫెవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. తండ్రి లాలను ఎంజాయ్ చేస్తున్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి. ఇటీవలే సూపర్ హిట్ అందుకుంది ఈ చిన్నది. ఆ భామ ఎవరో కాదు.

పై ఫొటోలో తండ్రితో పాటు ఉన్న చిన్నారి నేహా శెట్టి. పూరిజగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా వచ్చిన మెహబూబా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది నేహశెట్టి. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయినా నేహా నటనకు మంది మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించింది. ఇక ఈఏడాది విడుదలైన డీజే టిల్లు సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది.

ఇవి కూడా చదవండి

సిద్దూజొన్నల గడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమా మంచి హిట్ అయ్యింది. ఈ సినిమాలో నేహా నటనకు అందానికి కుర్రాళ్లంతా ఫిదా అయ్యారు. తాజాగా ఈ బ్యూటీ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒకటి రెండు సినిమాలను కమిట్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రోజు హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.