ఈ ఫొటోలో మెగాస్టార్‌తో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఆమె ఇప్పుడు హాట్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న హీరోయిన్

|

Dec 12, 2023 | 7:06 PM

హీరోయిన్స్ లేటెస్ట్ ఫొటోలతో పాటు చైల్డ్ హుడ్ ఫోటోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పై ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి పక్కన ఉన్న చిన్న పిల్లను గుర్తుపట్టారా..? ఆ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈ చిన్నది నటించిన సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది.

ఈ ఫొటోలో మెగాస్టార్‌తో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఆమె ఇప్పుడు హాట్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న హీరోయిన్
Actress
Follow us on

సోషల్ మీడియాలో చాలా ఫోటోలు వైరల్‌గా మారుతుంటాయి. సినిమా సెలబ్రెటీలకు సంబంధించిన ఫోటోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్స్ లేటెస్ట్ ఫొటోలతో పాటు చైల్డ్ హుడ్ ఫోటోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పై ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి పక్కన ఉన్న చిన్న పిల్లను గుర్తుపట్టారా..? ఆ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈ చిన్నది నటించిన సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది. అంతే కాదు అందాలతోనూ కవ్విస్తుంది ఈ చిన్నది. ఇంతకు ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..? ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

ఆమె మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటించింది ఈ చిన్నది. ఇంతకు పై ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి తో ఉన్న చిన్నది మరెవరో కాదు. ఆమె పేరు నిత్యా శెట్టి. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది ఈ చిన్నది. ముఖ్యంగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవుళ్ళు సినిమాలో నటించింది ఈ చిన్నది. ఆ సినిమాలో ఆలయాలన్నీ తిరిగే చిన్న పాప గా నటించింది.

అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన అంజి సినిమాలోనూ నటించింది నిత్యా. చిరు చుట్టూ ఉండే పిల్లల్లో నిత్యా ఒకరు. ఇక ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్ గాను సినిమాలు చేస్తోంది.పిట్ట కథ అనే సినిమాలో హీరోయిన్ గాను నటించింది నిత్యా శెట్టి. ఇక ఈ అమ్మడు మంచి ఛాన్స్ వస్తే నటిగా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిత్యా. రకరకాల ఫోటోలు షేర్ చేస్తుంది. అలాగే అందాల ఆరబోతలోనూ అదరగొడుతోంది నిత్య. ఈ ముద్దుగుమ్మ ఫోటోలు ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

నిత్యా శెట్టి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.