AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్..! ఈ సోడాబుడ్డి కళ్ళద్దాల కుర్రాది.. ఈ హాట్ బ్యూటీనా..!!

ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులందరిని కట్టిపడేసింది. అచ్చం పక్కింటి అమ్మాయిలా కనిపించి.. నటించి మెప్పించింది ఈ బ్యూటీ. అవ్వడానికి మలయాళీ భామే అయినా అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అందం అభినయం తో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ ఇప్పుడు కుర్ర హీరోలకు ఫస్ట్ ఛాయిస్ గా మారింది.

అమ్మబాబోయ్..! ఈ సోడాబుడ్డి కళ్ళద్దాల కుర్రాది.. ఈ హాట్ బ్యూటీనా..!!
Actress Photo
Rajeev Rayala
|

Updated on: Jan 24, 2025 | 1:15 PM

Share

ఒకప్పుడు అంటే మన హీరోయిన్లు ఒక ఇండస్ట్రీలోనే గిరిగీసుకుని కూర్చునేవారు.. కానీ ఇప్పుడు టాలీవుడ్ స్థాయి పెరిగిపోయింది. మన ఇండస్ట్రీ బౌండరీలు కూడా ప్యాన్ ఇండియా దాటేశాయి. దీంతోనే చాలామంది నటీమణులు.. ఒక ఇండస్ట్రీలోనే కాకుండా.. రెండు పడవలపైనా ప్రయాణం చేస్తూ.. చేతి నిండా సినిమాలతో తెగ బిజీ అయిపోతున్నారు. పైన పేర్కొన్న ఫోటోలోని అమ్మాయిని చూశారా.? ఆమె ఒక స్టార్ హీరోయిన్. ఒక్క ఇండస్ట్రీ కాదు.. ఏకంగా మూడు ఇండస్ట్రీలలో చక్రం తిప్పుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతికొద్దికాలంలోనే యంగ్ హీరోలతోనే కాదు.. స్టార్ హీరోల సరసన కూడా నటించే ఛాన్స్ దక్కించుకుంది. మన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఫ్రెండ్ ఈ బ్యూటీ. కన్నడ కస్తూరిగానే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఆమెవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి : పెళ్ళికి ముందే హీరోతో ఆ యవ్వారం కానిచ్చేసింది.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఎవరో తెలుసా.?

ఆమె మరెవరో కాదు అషికా రంగనాధ్. కర్ణాటకలోని తుమకూరులో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. బుల్లితెర నుంచి తన కెరీర్ నుంచి ప్రారంభించింది. పలు డ్యాన్స్ షోలలో పాల్గొని.. 2014లో మిస్ ప్రెష్ ఫేస్ పోటీల్లో రన్నరప్‌‌గా నిలిచింది. ఈమె అక్క అనూష రంగనాథ్ కూడా కన్నడ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. ‘క్రేజీ బాయ్’ అనే మూవీతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆషికా రంగనాథ్.. ‘రాంబో2’ మూవీతో తన తొలి హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ‘మదగజ’, ‘అవతార పురుష’, ‘గరుడ’ లాంటి చిత్రాలతో అషికా రంగనాధ్ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే పలు స్టార్ హీరోల సినిమాల్లోనూ క్యామియో రోల్స్‌లో అలరించింది ఈ అందాల భామ.

ఇది కూడా చదవండి :అప్పుడు తెలుగులో బ్యాన్ చేశారు.. ఇప్పుడు పిలిచి మరీ ఛాన్స్‌లు ఇస్తున్నారు.. బాబోయ్ ఈ బ్యూటీ మామూల్ది కాదు

మరోవైపు ‘పట్టాత్తు ఆర్సన్’ అనే మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆషికా.. గత ఏడాది తెలుగు ప్రేక్షకులను ‘అమిగోస్’ చిత్రంతో పలకరించింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత విజయం సాధించకపోయినా.. అషికా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత ‘నా సామి రంగా’ చిత్రంలో నాగార్జున సరసన యాక్ట్ చేసి.. పల్లెటూరి అమ్మాయిలా అందరినీ అలరించింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మూవీ ‘విశ్వంభర’లో నటిస్తోంది. అటు కన్నడం, తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది అషికా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత