ఏంటి..! ఈవిడ.. ఆవిడా ఒక్కరేనా..! సాయి పల్లవి వెనకున్నది ఎవరో కనిపెట్టరా.?

|

Oct 07, 2024 | 3:11 PM

ఈ సినిమా అందమైన ప్రేమకథగా తెరకెక్కింది.  ఇందులో శర్వానంద్, సాయి పల్లవి తమ నటనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సాయి పల్లవి మనకు ఇలాంటి లవర్ ఉండాలి అనేలా తన క్యూట్ పర్ఫామెన్స్‌తో మెప్పించింది. ఈ సినిమా 2018 డిసెంబరు 21న విడుదలైంది.

ఏంటి..! ఈవిడ.. ఆవిడా ఒక్కరేనా..! సాయి పల్లవి వెనకున్నది ఎవరో కనిపెట్టరా.?
Sai Pallavi
Follow us on

కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిన కూడా ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండి పోతుంటాయి.. అలాంటి సినిమాల్లో పడిపడిలేచే మనసు ఒకటి. శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా పడిపడిలేచే మనసు. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూ  డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమా అందమైన ప్రేమకథగా తెరకెక్కింది.  ఇందులో శర్వానంద్, సాయి పల్లవి తమ నటనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సాయి పల్లవి మనకు ఇలాంటి లవర్ ఉండాలి అనేలా తన క్యూట్ పర్ఫామెన్స్‌తో మెప్పించింది. ఈ సినిమా 2018 డిసెంబరు 21న విడుదలైంది. ఈ సినిమాను కోల్‌కతాలో షూట్ చేశారు. విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ఈ సినిమాకే హైలైట్ అనే చెప్పాలి. ఈ సినిమాలో ఇప్పుడు ఓ హీరోయిన్ కూడా నటించిందని తెలుస్తోంది. ఇంతకు పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో కనిపెట్టారా.?

పై ఫొటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా .?  చాలా మంది ఆమెను కనిపెట్టలేకపోయారు. ఆమె మరెవరో కాదు రీసెంట్ సూపర్ హిట్ మూవీ ప్రేమలు ఫేమ్ మమిత బైజు. పడి పడి లేచే మనసు సినిమాలోనూ ఓ సాంగ్ లో సాయి పల్లవి వెనక కనిపించిన యువతీ అచ్చం మమితలానే ఉంది. దాంతో ఆమె ఈ సినిమాలో నటించిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

పడి పడి లేచే మనసు సినిమాలో మమిత జూనియర్ ఆర్టిస్ట్ గా నటించిందని అంటున్నారు నెటిజన్స్. హీరోయిన్ అవ్వక ముందు మమిత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అలాగే పలు షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటించింది. అయితే ఈ సినిమాలో మమిత నటించిందా.? లేదా.? అన్నదానిపై క్లారిటీ అయితే లేదు. కానీ నెటిజన్స్ ఈ అమ్మడి ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కొందరు ఆమె మామిత కాదు అని అంటున్నారు మరికొంతమంది ఆమెనే అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మమిత ప్రేమలు సినిమాతో పాపులర్ అయ్యింది. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈ చిన్నదానికి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి