AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu: వైల్డ్ కార్డ్ వర్సెస్ పాత కంటెస్టెంట్స్.. నామినేషన్స్‏లో రచ్చే..

ముందు నుంచి నెట్టింట ప్రచారం జరుగుతున్నట్లుగానే గత సీజన్స్ కంటెస్టెంట్స్ మళ్లీ వచ్చారు. హరితేజ, టేస్టీ తేజ, నయని పావని, రోహిణి, గౌతమ్ కృష్ణ, గంగవ్వ, ముక్కు అవినాష్ హౌస్ లోకి అడుగుపెట్టారు. రావడంతోనే తమ పంచులు, కామెడీ టైమింగ్ లో హౌస్ లో నవ్వులు పూయించారు. కానీ ఇంతలోనే అసలు రచ్చ షూరు అయ్యింది. ఆరోవారం నామినేషన్స్ అంటూ అసలు మేలిక పెట్టాడు బిగ్‍బాస్. తాజాగా విడుదలైన ప్రోమోలో.. పాత కంటెస్టెంట్స్ తప్పొప్పలను చెబుతూ నామినేట్ చేశారు.

Bigg Boss 8 Telugu: వైల్డ్ కార్డ్ వర్సెస్ పాత కంటెస్టెంట్స్.. నామినేషన్స్‏లో రచ్చే..
Bigg Boss 8 Telugu
Rajitha Chanti
|

Updated on: Oct 07, 2024 | 3:38 PM

Share

బిగ్‍బాస్ సీజన్ 8 ఐదో వారంలో డబుల్ ఎలిమినేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఆదిత్య ఓం మిడ్ వీక్ బయటకు రాగా.. ఆదివారం ఎపిసోడ్‏లో నైనిక ఎలిమినేట్ అయ్యింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో మొత్తం ఎనిమిది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చారు. ముందు నుంచి నెట్టింట ప్రచారం జరుగుతున్నట్లుగానే గత సీజన్స్ కంటెస్టెంట్స్ మళ్లీ వచ్చారు. హరితేజ, టేస్టీ తేజ, నయని పావని, రోహిణి, గౌతమ్ కృష్ణ, గంగవ్వ, ముక్కు అవినాష్ హౌస్ లోకి అడుగుపెట్టారు. రావడంతోనే తమ పంచులు, కామెడీ టైమింగ్ లో హౌస్ లో నవ్వులు పూయించారు. కానీ ఇంతలోనే అసలు రచ్చ షూరు అయ్యింది. ఆరోవారం నామినేషన్స్ అంటూ అసలు మేలిక పెట్టాడు బిగ్‍బాస్. తాజాగా విడుదలైన ప్రోమోలో.. పాత కంటెస్టెంట్స్ తప్పొప్పలను చెబుతూ నామినేట్ చేశారు. ముందుగా యష్మీని నామినేట్ చేస్తూ తన రీజన్స్ చెప్పింది హరితేజ. వ్యక్తికి వ్యక్తికి రూల్స్ మారుతున్నాయని తెలిపింది.

దీంతో యష్మీ మాట్లాడుతూ.. తన గేమ్ కు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తానని యష్మీ చెప్పుకొచ్చింది. మీకు ఇష్టం లేదు అన్నచోట వేరే రూల్ అప్లై అవుతుందని హరితేజ చెప్పగా.. నా గేమ్.. నాకు ఎవరు డిస్ట్రబింగ్ గా ఉన్నారో వాళ్లను కదా చెయ్యాలి అని చెప్పింది. ఇక ఆ తర్వాత పృథ్వీని నామినేట్ చేసింది హరితేజ. అయితే తన నామినేషన్ అంగీకరించను అని పృథ్వీ చెప్పగా.. ఇది నా నామినేషన్.. ఇది నా ఓపినియన్ అంటూ కౌంటరిచ్చింది హరితేజ. నీ గేమ్ పక్కనపెడితే వేరే వ్యక్తి మీద దృష్టి పెట్టినట్లు అనిపిస్తుందంటూ విష్ణును నామినేట్ చేశాడు గౌతమ్ కృష్ణ. నేనేంటి.. నేనేం ఫీలయ్యాను .. నా ఎమోషన్స్ ఏంటీ అనేది నేను చూపిస్తానని చెప్పింది విష్ణు. ఇక నయని కూడా విష్ణును నామినేట్ చేస్తూ సీరియస్ నెస్ అసలు లేదనిపిస్తుంది అంటూ చెప్పింది. ఈ షో అర్థం చేసుకోవడానికి టైమ్ కావాలని విష్ణు చెప్పగా..బిగ్‍బాస్ పదిహేను వారాలు మాత్రమే అంటూ రివర్స్ కౌంటరిచ్చింది నయని.

ఎమోషన్స్ అంటే ఏడుపు మాత్రమే కాదని సీతను నామినేట్ చేసింది. ఇక ఈ వారంలో యష్మి, విష్ణు, గంగవ్వ, సీత, పృథ్వీ, మోహబాబ్ నామినేట్ అయినట్లు తెలుస్తోంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు ఇమ్యూనిటీ పవర్ ఉన్పపటికీ కచ్చితంగా ఇద్దరూ లిస్టులో ఉండాలని బిగ్‍బాస్ చెప్పడంతో మోహబాబ్, గంగవ్వ వచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us