Snehithudu Movie: అరె మిల్లిమీటర్ నువ్వా..? స్నేహితుడు మూవీ చైల్డ్ ఆర్టిస్ట్.. హీరోలకే ధీటుగా ఉన్నాడే..

|

Jan 09, 2025 | 7:07 AM

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించి ఇప్పుడు హీరోలుగా మెప్పిస్తున్నారు చాలా మంది. స్టార్ హీరోల సినిమాల్లో బాల తారలుగా కనిపించిన కొందరు ఇప్పుడు వరుస సినిమాలతో రాణిస్తున్నారు. అందులో ఈ మిల్లిమీటర్ కూడా ఒకరు. ఏంటీ మిల్లిమీటర్ అంటే గుర్తుపట్టలేదా.. ? విజయ్ దళపతి నటించిన స్నేహితుడు సినిమాలో కనిపించిన కుర్రాడే.

Snehithudu Movie: అరె మిల్లిమీటర్ నువ్వా..? స్నేహితుడు మూవీ చైల్డ్ ఆర్టిస్ట్.. హీరోలకే ధీటుగా ఉన్నాడే..
Rinson Simon
Follow us on

సినీరంగంలో చాలా మంది బాలనటీనటులకు మంచి గుర్తింపు ఉంటుంది. ఎన్నో సినిమాల్లో తమదైన నటనతో అలరించి మెప్పించారు. చిన్న వయసులోనే సహజ నటనతో కట్టిపడేశారు. వరుస సినిమాల్లో నటించి ఆ తర్వాత చదువుల కోసం ఇండస్ట్రీకి దూరమవుతారు. కానీ కొన్నాళ్ల తర్వాత హీరోహీరోయిన్లుగా మరోసారి రీఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే కొందరు చైల్డ్ ఆర్టిస్టులుగా వెండితెరపై సందడి చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అందులో రిన్సన్ సైమన్ ఒకరు. ఈ పేరు అంతగా తెలియదు. కానీ మిల్లిమీటర్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి నటించిన స్నేహితుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించాడు రిన్సన్ సైమన్. ఈ సినిమాలో తన కామెడీతో నవ్వులు పూయించాడు.

ఈ సినిమాలో మిల్లిమీటర్ గా కనిపించిన ఆ కుర్రాడు ఇప్పుడు సెంటిమీటర్ అయ్యాడు. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన ఈ కుర్రాడు.. ఇప్పుడు హీరోగా మారి ఆశ్చర్యపరుస్తున్నాడు. 1995లో ఆగస్ట్ 4న చైన్నెలో జన్మించిన రిన్సన్ సైమన్ కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడే లిటిల్ మాస్టర్స్, డ్యాన్స్ రియాల్టీ షో జోడీ నంబర్ 1, సీజన్ 5 వంటి షోలో పాల్గొన్న రిన్సన్ కొరియోగ్రాఫర్ కావాలని ఇండస్ట్రీలో ఆఫర్స్ కోసం ట్రై చేశాడు.

అదే సమయంలో 2008లో కళై సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించిన రిన్సన్2012లో శంకర్ దర్శకత్వం వహించిన స్నేహితుడు మూవీలో నటించాడు. 2013 వరకు సినిమాల్లో యాక్టివ్ గా ఉన్న రిన్సన్ చివరగా ధనుష్ నటించిన పాండి చిత్రంలో కనిపించాడు. తాజాగా ఈ కుర్రాడికి సంబంధించిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

Rinson Simon Pics

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.