దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన ప్రేమకథా చిత్రాల్లో గుండె ఝల్లుమంది ఒకటి. కొన్ని నెలల క్రితం చనిపోయిన మదన్ ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించారు. ఇందులో ఉదయ్ కిరణ్‌కు జోడీగా బాలీవుడ్ బుల్లితెరపై సత్తాచాటుతున్న అదితీ శర్మను తీసుకొచ్చారు మూవీ మేకర్స్. తెలుగులో మొదటి సినిమా అయినప్పటికీ ఎంతో చక్కగా నటించిందీ ముద్దుగుమ్మ. అందం, అభినయం పరంగా అందరినీ ఆకట్టుకుంది. అలాగే ఉదయ్‌కిరణ్‌కు పర్‌ఫెక్ట్ జోడీగా సూటయ్యింది. సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. అయితే మూవీ మాత్రం యావరేజ్ రిజల్ట్‌తోనే సరిపెట్టుకుంది. దీని తర్వాత ఓం శాంతి అనే మల్టీ స్టారర్ మూవీలో కనిపించింది. ఈ సినిమాకు ప్రశంసలు వచ్చాయి కానీ కమర్షియల్ హిట్ కాలేదు. ఆతర్వాత బబ్లూ అనే ఓ సినిమాలోనూ నటించింది అదితి. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. దీంతో టాలీవుడ్‌లో అదితీకి అవకాశాలు కరువయ్యాయి. ఆతర్వాత కొన్ని పంజాబీ, హిందీ సినిమాల్లో అదృష్టం పరీక్షించుకుంది. మొత్తం మీద తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, పంజాబీ, తదితర భాషలలో కలిపి దాదాపుగా 12కి పైగా చిత్రాలలో నటించింది అదితీ శర్మ.
ఈక్రమంలో సినిమా అవకాశాలు రాకపోవడంతో పెళ్లితో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది అదితి. బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ‘సర్వర్ ఆహుజా’ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం అదితి శర్మ దంపతులకు ఒక పాప కూడా ఉంది. ప్రస్తుతం ఆమె తన ఫ్యామిలీతో పాటు తన భర్త బిజినెస్ పనులను కూడా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమాలకు దూరంగా ఉన్న అదితీ శర్మ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడూ తన ఫొటోలను షేర్ చేస్తుంటుంది. అలా తాజాగా ఆమె ఫొటోలను చూసిన నెటిజన్ల కంట పడ్డాయి. ఇందులో అప్పటికీ, ఇప్పటికీ ఎంతో అందంగా ఉంది అందాల తార. అమ్మయిన తర్వాత కూడా ఈ అమ్మడి అందం ఏ మాత్రం తగ్గడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..