Sakshi Shivanand: ఒకప్పటి కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. సాక్షి శివానంద్ ఫోటోస్ వైరల్..

|

Jul 27, 2024 | 1:59 PM

1993లోనే అన్నా వదిన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో కృష్ణంరాజు, జయప్రద హీరోహీరోయిన్లుగా నటించగా.. సాక్షి శివానంద్ మరో యంగ్ హీరో సరసన నటించింది. ఆ తర్వాత హిందీ సినిమాల్లో నటించింది. అక్కడ సక్సెస్ అయ్యాక.. చిరంజీవి మూవీ మాస్టర్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో చిరు జోడిగా నటించి అలరించింది.

Sakshi Shivanand: ఒకప్పటి కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. సాక్షి శివానంద్ ఫోటోస్ వైరల్..
Sakshi Shivandh
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ అందం, అభినయంతో అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. స్టార్ హీరోస్ సరసన నటించి మెప్పించిన తారలు అనుకోకుండా వెండితెరకు దూరమవుతుంటారు. అందులో సాక్షి శివానంద్ ఒకరు. అందమైన రూపం.. చక్కటి చిరునవ్వు.. అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. సహజమైన నటనతో పక్కింటి అమ్మాయిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. 1993లోనే అన్నా వదిన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో కృష్ణంరాజు, జయప్రద హీరోహీరోయిన్లుగా నటించగా.. సాక్షి శివానంద్ మరో యంగ్ హీరో సరసన నటించింది. ఆ తర్వాత హిందీ సినిమాల్లో నటించింది. అక్కడ సక్సెస్ అయ్యాక.. చిరంజీవి మూవీ మాస్టర్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో చిరు జోడిగా నటించి అలరించింది.

మాస్టార్ సినిమాతో ఇండస్ట్రీలో మంచి క్రేజ్ వచ్చింది. ఇందులో ఆ బ్యూటీ క్యూట్ నెస్ కు ఫిదా అయ్యారు ఫ్యాన్స్. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. 90’sలో తన సినిమాలతో దుమ్ము దులిపేసిన ఈ బ్యూటీ.. అప్పట్లో కుర్రాళ్ల ఫేవరేట్ క్రష్. దీంతో సాక్షికి బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ వచ్చాయి. అతి తక్కువ సమయంలోనే తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, రాజశేఖర్, నాగార్జున వంటి స్టార్ హీరోస్ సరసన నటించింది. కలెక్టర్ గారు, రాజహంస, నిధి వంటి చిత్రాల్లో మెప్పించింది.

సీతారామరాజు, పెళ్లి వారమండి, యమ జాతకుడు, వంశోద్ధారకుడు, యువరాజు వంటి చిత్రాలు సాక్షి కెరీర్ ను మలుపు తిప్పాయి. రాజశేఖర్, సాక్షి కాంబోలో వచ్చిన సింహరాశి సినిమా ఎవర్ గ్రీన్ హిట్. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. తెలుగు, కన్నడ, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించిన సాక్షి .. ఆతర్వాత సినిమాలకు దూరమైంది. అటు సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటుంది. దీంతో ఈ బ్యూటీకి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. కానీ సాక్షి శివానంద్ చెల్లెలు శిల్పా శివానంద్ మాత్రం అప్పుడప్పుడు తన సోదరి ఫోటోస్ షేర్ చేసింది. సాక్షి అమెరికాకు చెందిన సాగర్ అనే వ్యక్తిని 2016లో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.